మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి(dhoni news) విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) కోసం అతడిని టీమ్ఇండియా మెంటార్‌గా ఎంపిక చేశారు. ఈ విషయమై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ అతడిపై ఫిర్యాదు చేశారు.
బుధవారం 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ(bcci news) ప్రకటించింది. ధావన్ చోటు కోల్పోగా, అశ్విన్ అవకాశం దక్కించుకున్నాడు. అక్టోబరు 17న టీ20 ప్రారంభం కానుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో(pakistan vs india) తన తొలి మ్యాచ్ ఆడనుంది కోహ్లీసేన.
అయితే భారత జట్టుకు ధోనీని మెంటార్‌గా నియమించడం బీసీసీఐ గౌరవంగా భావిస్తుందని బోర్డు అధ్యక్షుడు గంగూలీ(ganguly on dhoni) చెప్పారు. దాదాపు 15 ఏళ్ల పాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ.. కెప్టెన్‌గా 2007 టీ20 ప్రపంచకప్(2007 world cup dhoni), 2011 వన్డే ప్రపంచకప్(2011 world cup dhoni), 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గానూ రికార్డు సృష్టించాడు.