Champions Trophy 2025 Host Pakistan : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు సంబంధించి ఐసీసీతో ఒప్పందం కుదిరిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు- పీసీబీ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం పీసీబీ వ్యవహారాలను చూస్తున్న జకా అష్రఫ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారని వెల్లడించింది. 'ఐసీసీ ప్రధాన కార్యాలయంలో పాకిస్థాన్‌కు హోస్టింగ్ హక్కులపై ఐసీసీ జనరల్ కౌన్సెల్ జోనాథన్ హాల్ సమక్షంలో పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ జకా అష్రఫ్ సంతకం చేశారు' అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
-
PCB signs Champions Trophy hosting rights agreement with ICC
— PCB Media (@TheRealPCBMedia) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details here⤵️https://t.co/s94ACBDzYd
">PCB signs Champions Trophy hosting rights agreement with ICC
— PCB Media (@TheRealPCBMedia) December 15, 2023
Details here⤵️https://t.co/s94ACBDzYdPCB signs Champions Trophy hosting rights agreement with ICC
— PCB Media (@TheRealPCBMedia) December 15, 2023
Details here⤵️https://t.co/s94ACBDzYd
పాకిస్థాన్ చివరగా 1996 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 2009 ఛాంపియన్స్ ట్రోపీ, 2011 వరల్డ్ కప్ నిర్వహించే ఛాన్స్ వచ్చింది. కానీ 2009లో లాహోర్‌లో శ్రీలంక ప్లేయర్లపై ఉగ్రదడి జరగడం వల్ల భద్రతా కారణాల రీత్యా ఆ రెండు ఈవెంట్లను అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో భారత్ తన జట్టును అక్కడికి పంపిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయంపై భారత్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్ నిజానికి పాకిస్థాన్‌లోనే జరగాల్సింది. కానీ భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లలేదు. దీంతో ఇండియా మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.
'మా దేశానికి రాకపోతే పరిహారం చెల్లించాలి!'
ఒక వేళ భద్రత కారణాలు చెప్పి పాకిస్థాన్‌లో పర్యటించడానికి భారత్ నిరాకరిస్తే అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఐసీసీని పీసీబీ కోరినట్లు గత నెల వార్తలు వచ్చాయి. 'భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే స్వతంత్ర భద్రతా ఏజెన్సీని నియమించాలని పీసీబీ అధికారులు ఐసీసీకి తెలిపారు. దీంతోపాటు భారత్ సహా టోర్నీలో పాల్గొనే జట్ల భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం, భద్రతా అధికారుల ఏజెన్సీతో తాము అనుసంధానం చేయగలమని చెప్పారు. గత రెండేళ్లలో ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు లేకుండానే అనేక అగ్రశ్రేణి జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాయని వారు ఐసీసీకి తెలియజేశారు' అని ఓ గతంలో ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవే - శ్రీలంకకు ఇదే తొలిసారి!
పాకిస్థాన్‌కు షాక్!- ఐస్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ- ఇదంతా భారత్ పనేనా!