ETV Bharat / sports

ఆస్ట్రేలియా క్రికెట్లో బాన్​క్రాఫ్ట్ కలకలం

ఆస్ట్రేలియా క్రికెటర్లో బాల్ టాంపరింగ్ ఉదంతం మరోసారి కలకలం రేపుతోంది. టాంపరింగ్‌ గురించి అప్పట్లో తమ బౌలర్లకు కూడా తెలుసని బాన్​క్రాఫ్ట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఆస్ట్రేలియా క్రికెట్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దానిపై సమగ్ర విచారణ జరిపించడంలో సీఏ విఫలమైందంటూ ఆరోపణలు వస్తున్నాయి.

author img

By

Published : May 18, 2021, 9:04 AM IST

Bancroft
బాన్​క్రాఫ్ట్

ఆస్ట్రేలియా క్రికెట్లో పెను ప్రకంపనలు రేపిన బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం చోటు చేసుకుని మూడేళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ ఉదంతంపై చర్చకు తెరలేపాడు బాన్‌క్రాఫ్ట్‌. టాంపరింగ్‌ గురించి అప్పట్లో తమ బౌలర్లకు కూడా తెలుసని అతను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఆస్ట్రేలియా క్రికెట్లో కలకలం రేపుతోంది. నాటి ఉదంతానికి సంబంధించి కొత్త విషయాలేమైనా ఉంటే చెప్పాలంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఇంటెగ్రిటీ యూనిట్‌ అధికారులు అతణ్ని కోరారు.

"ఆ ఉదంతంపై అప్పట్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. అయితే ఎవరైనా ఆ వ్యవహారంపై కొత్త సమాచారం ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించేలా ప్రోత్సహిస్తాం. మా సిబ్బంది బాన్‌క్రాఫ్ట్‌ను కలిసి మాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చని అన్నారు. అతడి స్పందన కోసం ఎదురు చూస్తాం"’ అని సీఏ ప్రతినిధి బెన్‌ ఆలివర్‌ తెలిపాడు.

అతడి మాటల్లో ఆశ్చర్యమేముంది.. క్లార్క్‌

"టాంపరింగ్‌ గురించి తమ బౌలర్లకూ తెలుసన్న బాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలపై ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ అన్నాడు. ‘‘ఓ ఆటగాడు బంతిని ఏదో చేసి బౌలర్‌ దగ్గరికి పంపినపుడు దాని గురించి అతడికెలా తెలియకుండా ఉంటుంది? బాన్‌క్రాఫ్ట్‌ ఏదో ఆశ్చర్యకర విషయాలను వెల్లడించినట్లుగా పత్రికలు రాయడం చిత్రం" అని క్లార్క్‌ అన్నాడు.

విచారణ సరిగా జరగలేదు

"2018 నాటి బాల్‌టాంపరింగ్‌ ఉదంతంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ సరిగా సాగలేదని మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘సమస్య మూలాల్లోకి వెళ్లి సమగ్రమైన విచారణ చేపట్టడం ద్వారా ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి అప్పుడు అవకాశం లభించింది. కానీ సీఏ ఆ లోతుల్లోకి వెళ్లాలనుకోలేదు. ఈ సమస్య వ్యవస్థీకృతం అయిందా అని విచారించే ప్రయత్నం చేయలేదు. ఆ ఉదంతం తర్వాత ప్రపంచ క్రికెట్లో రివర్స్‌ స్వింగ్‌ బాగా తగ్గిపోయింది. ఆటగాళ్లపై శిక్షలు పడటం వల్ల జరిగిన మంచి పరిణామం ఇది" అని గిల్లీ అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.