నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20కు ముందు టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గాయం కారణంగా తొలి టీ20కు దూరమైన భారత స్టార్ పేసర్ బుమ్రా.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు కీలకమైన రెండో టీ20కు తుది జట్టులోకి రానున్నాడు. ఈ విషయాన్ని భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
గురువారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. "బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు నాగ్‌పూర్ మ్యాచ్‌కు జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం జట్టులో అందరూ ఫిట్‌గా ఉన్నారు" అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ఉమేశ్ యాదవ్ స్థానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ చేతిలో టీమ్ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోర్ సాధించినప్పటికీ.. ఫీల్డింగ్, బౌలింగ్‌లో విఫలకావడం వల్ల ఓటమి తప్పలేదు. దీంతో రెండో టీ20లో ఏలగైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తోంది.
ఇదీ చూడండి: IND VS AUS: వామ్మో ఏందిది.. ఈ ఫొటోలు చూశారా?.. టికెట్ల కోసం మరీ ఇంతలా..