Brendan Taylor spot fixing: స్పాట్ ఫిక్సింగ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఓ బుకీ నుంచి తాను కొంత మొత్తంలో డబ్లులు కూడా అందుకున్నట్లు వెల్లడించాడు. అయితే తనను వారు బెదరించి ఆ పనికి పాల్పడేలా చేశారని పేర్కొన్నాడు.
"రెండేళ్లుగా నేను ఈ భారాన్ని మోస్తున్నా. ఈ కారణంగా కొన్ని రోజులు చీకట్లో కూడా బతకాల్సి వచ్చింది. నా మానసిక ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. 2019లో ఓ భారత వ్యాపారవేత్తతో స్పానర్షిప్ గురించి మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను. జింబాబ్వేలో ఓ టీ20 ప్రారంభించాలని ఆలోచనతో ఉన్నాం. అప్పటికే మాకు బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేపు. చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాం. వాళ్లు నాకు రూ. 15వేల డాలర్లు ఇస్తానన్నారు. మా మీటింగ్ చివరి రాత్రి ఆ బిజినెస్‌మ్యాన్, అతడి మనషులు నన్ను కలవడానికి వచ్చారు. పార్టీ ఇచ్చారు. కొకైన్ ఆఫర్ చేశారు. కాదనలేక తీసుకున్నా. ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని బెదిరించారు. ఆ తర్వాతి రోజు అతడు నా హోటల్ రూమ్‌కు కూడా వచ్చాడు. అతడితో పాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్లని చూసి భయమేసింది. ఏం చేయాలో తెలియక వాళ్లు చెప్పినదానికి అంగీకరించాను. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. స్వదేశానికి వచ్చిన ఆ తర్వాత ఆ సంఘటన మానసికంగా శారీరకంగా చాలా దెబ్బతీసింది. ఆ వ్యాపారవేత్త తరచుగా ఫోన్ చేసేవాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించేవాడు. ఈ విషయాన్ని ఐసీసీకి చెప్పడానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది. కానీ నేను ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్‌లలో పాల్గొనలేదు. ఇప్పుడీ విషయాన్ని బయటపెట్టడం వల్ల ఐసీసీ నాపై ఏడాది కన్నా ఎక్కువ సంవత్సరాలు నిషేధం విధించవచ్చు. అయితే నాకు జరిగిన ఈ విషయం, కొత్త క్రికెటర్లు జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నా కుటుంబం, నా స్నేహితులు, మరీ ముఖ్యంగా నన్ను నేను మోసం చేసుకుంటూ బతకలేను. విలువలతో బతకాలనేదే నా ఉద్దేశం."
- జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్.
జింబాబ్వే తరఫున 34 టెస్టులు(2320 పరుగులు), 205 వన్డేలు(6684), 45 టీ20లు(934) ఆడాడు టేలర్.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!