ETV Bharat / sports

ఆసీస్​కు ఎదురుదెబ్బ.. గాయంతో మరో స్టార్ ప్లేయర్ దూరం! - జోష్​ హేజిల్​వుడ్​కు గాయం

Border Gavaskar Trophy 2023 : బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ మొదలుకానున్న నేపథ్యంలో.. ఆసీస్​ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇదివరకే స్టార్​ పేసర్​ టీమ్​కు దూరమవగా.. తాజాగా మరో ప్లేయర్ గాయాలపాలయ్యాడు. టీమ్​ఇండియా బౌలర్లను ఎదుర్కొనడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కంగారూ జట్టుకు ఇది గట్టి దెబ్బే.

josh hazlewood ruled out of border gavaskar trophy 2023

author img

By

Published : Feb 5, 2023, 5:28 PM IST

Border Gavaskar Trophy 2023 : బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ తొలి టెస్టుకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్లేయర్లకు గాయాలు అవుతుండటం వల్ల ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. భారత్​తో జరిగే తొలి టెస్టు ముందే ఆసీస్​ స్టార్​ పేసర్​ మిచెల్​ స్టార్క్ వేలికి​ గాయం అవడం వల్ల జట్టుకు దూరమయ్యాడు. తాజాగా మరో పేసర్​ జోష్​ హేజిల్​వుడ్​ ఎడమ కాలికి గాయం అయింది. దీంతో అతడు కూడా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదివరకే గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆల్​రౌండర్​ కామెరూన్​ గ్రీన్..​ ఇప్పుడే కోలుకుంటున్నాడు. అతడు మొదటి టెస్టు వరకు అందుబాటులో ఉండకపోవచ్చు. స్టార్ బౌలర్లు జట్టుకు దూరమవడం వల్ల.. ఆస్ట్రేలియా టీమ్​ బలహీన పడే అవకాశం ఉంది.

కాగా, టీమ్ఇండియా స్పిన్​ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆసీస్​ పూర్తి స్థాయిలో సమాయాత్తమవుతోంది. అందుకోసం కఠోర సాధన చేస్తోంది. అందులో భాగంగా కర్ణాటకలోని ఆలూర్​ స్టేడియంలోని పిచ్​ను కఠినంగా తయారు చేయించుకని ప్రాక్టీస్​ మొదలు పెట్టింది. మరోమెట్టు పైకెక్కి.. అచ్చం అశ్విన్​లా స్పిన్​ వేసే బౌలర్​ అని పేరున్న మహేష్​ పితియాను రప్పించుకుంది ఆసీస్​ జట్టు. గతంలో అశ్విన్​ను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడ్డ కంగారూ బ్యాటర్లు.. ఈసారి ఈ ఉపాయం చేశారు. ఇక, భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగు టెస్టు బోర్డర్​ గవాస్కర్​ ట్రోఫీలు ఫిబ్రవరి 9న నాగ్​పుర్​ వేదికగా తొలి టెస్టు జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.