ETV Bharat / sports

తెలుగు క్రికెటర్‌ కేఎస్​ భరత్‌పై ట్రోల్స్​.. అసలు ఇలా చేయడం కరెక్టేనా? - తెలుగు కుర్రాడు కేఎస్ భరత్​పై ట్రోల్స్​

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ 2023తో టీమ్​ఇండియా టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు, యంగ్ క్రికెటర్​ కేఎస్‌ భరత్‌పై సోషల్​మీడియాలో విపరీతంగా ట్రోల్స్​ వస్తున్నాయి. అతడు సరిగ్గా ఆడలేకపోతున్నాడంటూ తెగ విమర్శలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో మరికొంతమంది కూడా అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. అసలు ఇంతకీ ఈ ట్రోల్స్​ చేయడం ఎంత వరకు సమంజసం?

Border Gavaskar Trophy 2023 IND VS AUS Telugu player KS Bharat Trolls
తెలుగు క్రికెటర్‌ కేఎస్​ భరత్‌పై ట్రోల్స్​.. అసలు ఇలా చేయడం కరెక్టేనా?
author img

By

Published : Mar 4, 2023, 10:17 AM IST

Updated : Mar 4, 2023, 11:07 AM IST

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ 2023తో టీమ్​ఇండియా టెస్టు క్రికెట్‌లోకి తెలుగు కుర్రాడు, యంగ్ క్రికెటర్​ కేఎస్‌ భరత్‌ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్​-భారత్​ మధ్య జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కింది. కానీ అతడు ఏ ఒక్క మ్యాచ్​లోనూ బ్యాటింగ్​లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి టెస్టులో 8, రెండో టెస్టులో 6, 23*​, మూడో టెస్టు 17, 3 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో భరత్‌.. సోషల్‌ మీడియాలో​ ట్రోల్స్​కు గురయ్యాడు. అయితే ఇండోర్​ వేదిక జరిగిన మూడో మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘోర పరాజయం అందుకున్న తర్వాత కూడా అతడు ట్రోల్​ అవుతూనే ఉన్నాడు. కొంతమంది నెటిజన్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మరి కొంతమంది నెటిజన్లు అతడికి మద్దతు ఇస్తున్నారు. ఈ ట్రోల్స్​​ చేస్తున్నవారంతా సిరీస్​ ఎలా జరుగుతుందో పెద్దగా గమనించట్లేదని.. అందుకే భరత్​పైనే మాత్రమే ట్రోల్​ చేస్తూ వస్తున్నారని.. మద్దతు ఇచ్చే వాళ్లు అంటున్నారు.

విషయానికొస్తే.. ఈ నాలుగు మ్యాచుల టెస్ట్​ సిరీస్​ను దక్కించుకోవడంతో పాటు వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​ బెర్త్​ ఖరారు చేసుకోవాలి, ఐసీసీ నెం.1టెస్ట్​ టీమ్​గా అవతరించాలనే లక్ష్యంతో టీమ్​ఇండియా ఈ సిరీస్‌ బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే అన్ని మ్యాచ్​లకు బంతి ఎక్కువగా గింగరాలు తిరిగేలా స్పిన్‌ పిచ్‌లను తయారు చేయించింది. అలానే తొలి రెండు టెస్టుల్లో మంచి విజయం సాధించింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, మూడో టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు విజయం దక్కలేదు. తమ ప్లాన్ రివర్స్ కొట్టింది. ఎందుకంటే స్పిన్నర్లు మన టీమ్​లోనే కాదు ప్రత్యర్థి జట్టులోనూ నాథన్‌ లయన్‌, టాడ్‌ మర్ఫీ, కుహ్నేమన్‌ లాంటి ప్రతిభ ఉన్న స్పిన్నర్లు ఉన్నారు.

స్పిన్‌కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్‌పై ఈ సారి ఆసీస్‌ బౌలర్లు విజృంభించారు. వారి దెబ్బకు టాప్ ప్లేయర్స్​ కెప్టెన్​ రోహిత్‌ శర్మ, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, పుజారా, జడేజా, గిల్‌ లాంటి ప్లేయర్స్​ కూడా స్కోరు చేయలేక వెనక్కి తిరిగారు. మొత్తంగా బ్యాటింగ్​ లైనప్​ ఫెయిల్ అయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లే ఈ పిచ్​లపై విఫలమైనప్పుడు.. ఓ యువ క్రికెటర్​నే పట్టుకుని, అందులోనూ ఒక అరంగేట్రం ప్లేయర్​ను ఎందుకు ఇలా ట్రోల్​ చేస్తున్నారు అంటూ భరత్​ మద్దతుదారులు అంటున్నారు. అతడికి ఇలాంటి పిచ్‌లపై ఆడటం ఎంతో పెద్ద పరీక్ష లాంటిదని... కానీ ఓ వికెట్‌ కీపర్‌గా అతడు తన వంతు పాత్ర బాగానే పోషిస్తున్నాడని పేర్కొంటున్నారు. గింగిరాలు తిరుగుతున్న బంతులను పట్టుకుంటూ బౌలర్లకు మద్దతుగా నిలుస్తున్నాడని. . వికెట్ల వెనుక ఉంటూ రివ్యూలో తీసుకోవడంలో కెప్టెన్‌ రోహిత్​కు తోడుగా నిలుస్తున్నాడని చెబుతున్నారు. మొత్తంగా వికెట్​ కీపింగ్ బాగా చేస్తున్నాడని అంటున్నారు.

అతడి దేశవాళీ క్రికెట్‌లో గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. అతడు 89 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్​ల్లో ఒక త్రిపుల్​ సెంచరీ, 9 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 4764 పరుగులు చేశాడు. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 64 మ్యాచ్‌ల్లో 6 శతకాలు, 6 అర్ధ శతకాలు బాది 1950 పరుగులు చేశాడు. మరి ఇంత మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్ కేవలం రెండు, మూడు టెస్టుల్లో విఫలమైతే మరీ ఇంతలా ట్రోల్​ చేయడం సరికాదేమో అంటూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ సమరానికి సై.. ఈ విషయాలు తెలుసా?

Last Updated : Mar 4, 2023, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.