ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్(ICC rankings)లో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమ స్థానం సంపాదించాడు. వాషింగ్టన్ సుందర్‌ను వెనక్కు నెట్టి 16వ స్థానం దక్కించుకున్నాడు. సుందర్కన్నా 3 పాయింట్లు ఎక్కువగా సంపాందించి మొత్తం 588 పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20లో ఉత్తమ ప్రదర్శన కనబరచడం భువీకి కలిసొచ్చింది.
భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. చాహల్ 21 స్థానం దక్కించుకోగా, దీపక్ 34వ స్థానంలో ఉన్నాడు.
నెంబర్ 2..
శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టీ20 బౌలర్లలో రెండో స్థానం దక్కించుకున్నాడు. అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్‌ను వెనక్కి నెట్టాడు. వనిందు ఖాతాలో 720 పాయింట్లు ఉండగా.. రషీద్ ఖాన్ 719 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రియజ్ షంసీ 792 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.
ఇదీ చదవండి:ICC Rankings: మెరుగైన ధావన్, చాహల్ స్థానాలు