Bharat Arun Coach: ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే మెగా వేలం ప్రక్రియ ప్రారంభంకానుందని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ తమ జట్టుకోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను ఎంపిక చేసింది. భరత్ అరుణ్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
"కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో విజయవంతమైన టీమ్‌గా రాణిస్తోంది. ఈ ఫ్రాంఛైజీతో పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా." అని భరత్ అరుణ్ అన్నాడు. కేకేఆర్ ఫ్రాంఛైజీ నిర్ణయం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా సీనియర్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన భరత్ అరుణ్ ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం కేకేఅర్ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు.
"కేకేఆర్ కోచింగ్ బృందంలో చేరిన భరత్ అరుణ్‌కు స్వాగతం. అంతర్జాతీయ క్రికెట్‌పై మంచి పట్టున్న భరత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. అతడు ఇతర కోచింగ్ బృందంతో కలిసి బాగా పనిచేస్తాడని ఆశిస్తున్నా." అని కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ అన్నాడు.
తమిళనాడు దేశవాళీ జట్టుతో కోచ్‌గా కెరీర్ ప్రారంభించాడు భరత్ అరుణ్. తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఛీఫ్ బౌలింగ్ కోచ్‌గా విధులు నిర్వహించాడు. ఆస్ట్రేలియాలో అండర్-19 కప్ గెలిచిన భారత అండర్-19 జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
ఇదీ చదవండి:
ఐపీఎల్ మెగా వేలం తేదీ ఖరారు.. కొత్త ఫ్రాంఛైజీలకు లైన్ క్లియర్