Ben Stokes Record: ప్రస్తుతం క్రికెట్లో ఆల్‌రౌండర్ అనే పాత్రకు న్యాయం చేసే వారు తక్కువ మందే ఉన్నారు. ఇందులో ఇంగ్లాండ్ క్రికెటర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్మాట్లో 100 వికెట్లకుతోడు.. 100 సిక్సర్లతో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో హెడింగ్లేలో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఈ రికార్డును అందుకున్నాడు స్టోక్స్.
మూడో టెస్టు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు స్టోక్స్. ఇందులో 2 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. ఇది అతడికి టెస్టు ఫార్మాట్లో 100వ సిక్స్. మొత్తం 81 టెస్టులాడిన స్టోక్స్ ఇప్పటికే 177 వికెట్లు కూడా తీశాడు. దీంతో టెస్టు క్రికెట్లో 100 వికెట్లు, 100 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 329 పరుగులకు ఆలౌటైంది. మిచెల్(109) టాప్ స్కోరర్. బ్లండెల్ 55 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 5 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం.. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు తన పేస్‌తో చుక్కలు చూపించాడు లెఫ్టార్మ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్. టాప్-3 బ్యాటర్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. బెయిర్‌స్టో (126 బంతుల్లో 130), జేమీ ఓవర్టన్(106 బంతుల్లో 89) వన్డే తరహాలో చెలరేగగా ఇంగ్లాండ్ రెండో రోజు 264/6తో నిలిచింది. ఆట ఇంకా 3 రోజులు మిగిలిఉంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లాండ్.. 2-0తో ఇప్పటికే సిరీస్ దక్కించుకుంది.
ఇవీ చూడండి: ఒకే ఒక్కడు 'మిచెల్'.. ఇంగ్లాండ్‌పై 400 పరుగులు చేసి రికార్డు!
వివాదాస్పద పాక్ 'అంపైర్'.. ఇప్పుడు బట్టలు, చెప్పులు అమ్ముకుంటూ!