టీమ్ఇండియా తరఫున అరంగేట్ర మ్యాచ్ సందర్భంగా తాను స్వీయ సలహా ఇచ్చుకున్నానని వెల్లడించాడు యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు సూర్య.
"మీరు సరిగ్గా గమనించి ఉంటే నా తొలి మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ అదే సమయంలో రోహిత్ ఔట్ కావడం వల్ల సంతోషంగా ఉండలేకపోయాను. బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వెళ్లేముందు కొంత ఆందోళన చెందాను. కానీ, నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. 'గతంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసినప్పుడు ఎలా ఆడావో.. ఇప్పుడూ అలానే ఆడు. అంతకుమించి వద్దు. నువ్వు నువ్వులా ఉండు.' అని స్వీయ సలహా ఇచ్చుకున్నాను."
-సూర్య కుమార్ యాదవ్, టీమ్ఇండియా బ్యాట్స్‌మన్.
ఇక ఆ మ్యాచ్‌లో తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపడంపైనా స్పందించాడు సూర్య. "ఆర్చర్ బౌలింగ్‌లో ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్న కారణంగానే అలాంటి షాట్ కొట్టగలిగాను. క్రీజులోకి వచ్చాక.. నేను ఊహించిన బంతినే వేశాడు. దీంతో తొలి బంతినే సిక్సర్‌గా మలిచాను" అని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: 'అప్పట్లో ద్రవిడ్‌ను చూస్తే భయపడేవాళ్లం'