ETV Bharat / sports

కరోనా బాధితుల కోసం బీసీసీఐ సాయం

దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్​ బాధితులకు అండగా నిలిచేందుకు భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. పది లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వేల ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేయనున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.

BCCI to donate 10-litre 2000 oxygen concentrators
బీసీసీఐ 2 వేల ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు
author img

By

Published : May 24, 2021, 2:49 PM IST

Updated : May 24, 2021, 4:24 PM IST

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుకొచ్చింది. పది లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వేల ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను తమ వంతు సాయంగా అందజేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇదే విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ, సెక్రటరీ జైషా మాట్లాడారు.

"కరోనాపై పోరాటంలో వైద్య, ఆరోగ్య రంగం చేస్తోన్న కృషిని బీసీసీఐ గుర్తించింది. మనల్ని కాపాడేందుకు వైరస్​పై వారు ముందుండి పోరాటం చేస్తున్నారు. ఈ ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను అందజేసే ప్రక్రియలో వైద్య రంగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల వల్ల కరోనా బాధితులు వెంటనే కోలుకునేందుకు అవకాశం ఉన్నందున వీటిని విరాళంగా ఇవ్వాలనుకున్నాం".

- సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

"చేయి చేయి కలిపి కరోనాపై మనం పోరాటం చేయాలి. ప్రస్తుతం దేశంలోని డిమాండ్​ కారణంగా కరోనా బాధితులకు అవసరమైన వైద్య​ పరికరాలు అందుబాటులో లేవని గ్రహించాం. కరోనాపై మనం నిరంతరం పోరాటం చేస్తున్నాం. కానీ, ప్రస్తుతం వాక్సినేషన్​ జరుగుతోన్న కారణంగానే కరోనాపై మనమంతా విజయం సాధించగలమని నమ్ముతున్నా. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కోరుతున్నా" అని జైషా అన్నారు.

ఇదీ చూడండి.. సుశీల్​ను ఉరి తీయాలి: సాగర్ తల్లిదండ్రులు

Last Updated : May 24, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.