ETV Bharat / sports

మూడు మెగా టోర్నీల కోసం బీసీసీఐ బిడ్లు! - 2031 వన్డే ప్రపంచకప్

ఐసీసీకి సంబంధించిన మూడు అతిపెద్ద టోర్నీల నిర్వహణ కోసం వేలంలో పాల్గొనాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో ఒకటి ఛాంపియన్స్​ ట్రోఫీ కాగా రెండు పరిమిత ఓవర్ల ప్రపంచకప్​లు ఉన్నాయి. 2024 నుంచి ఎనిమిదేళ్ల కాలానికి క్రికెట్ చక్రం ప్రారంభం కానుంది.

bcci, icc
బీసీసీఐ, ఐసీసీ
author img

By

Published : Jun 21, 2021, 5:30 AM IST

రానున్న ఎనిమిదేళ్ల క్రికెట్​ కాలానికి సంబంధించి మూడు ఐసీసీ టోర్నీల నిర్వహణకు బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. 2024 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్​ చక్రంలో మూడు అతిపెద్ద టోర్నీల నిర్వహణకు బిడ్లు దాఖలు చేయాలని నిర్ణయించింది. ఆదివారం వర్చువల్​గా జరిగిన అత్యవసర అపెక్స్​ కౌన్సిల్​లో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో 2025 ఛాంపియన్స్​ ట్రోఫీతో పాటు 2028 టీ20 ప్రపంచకప్​, 2031 వన్డే వరల్డ్​కప్​ ఉంది. ఇంగ్లాండ్​ వేదికగా 2017లో నిర్వహించబోయే ఛాంపియన్స్​ ట్రోఫీ తర్వాత టోర్నీ వేదికను ఐసీసీ వెల్లడించలేదు. అందుకు సంబంధించి బిడ్లు దాఖలైన తర్వాతనే ఆతిథ్య దేశాన్ని ప్రకటించనున్నట్లు తెలిపింది.

"అవును, 2025 ఛాంపియన్స్​ ట్రోఫీతో పాటు 2028 టీ20 ప్రపంచకప్, 2031 వన్డే వరల్డ్​కప్​ కోసం బిడ్లు దాఖలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందుకు అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఇందులో ఛాంపియన్స్​ ట్రోఫీ చిన్న టోర్నీ అయినప్పటికీ.. చాలా ప్రజాదరణ పొందింది. భారత్ వేదికగా 2023లో జరగనున్న ప్రపంచకప్​ తర్వాత ఇది జరగనుంది. ప్రతి రెండేళ్లకో సారి ఐసీసీ ఈవెంట్​ను నిర్వహించేలా బీసీసీఐ ఉండాలి. అందుకే ఈ మూడు అతి పెద్ద టోర్నీలకు బిడ్లు దాఖలు చేయాలనుకున్నాం" అని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు.

రానున్న క్రికెట్ చక్రంలో 50 ఓవర్ల ప్రపంచకప్​లో 14 జట్లను ఆడించాలని ఐసీసీ నిర్ణయించింది. అదే టీ20 వరల్డ్​కప్​లో ఈ సంఖ్య 20కి పెంచాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: బౌలింగ్ మాంత్రికుడికే స్పిన్ పాఠాలు.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.