ETV Bharat / sports

BCCI మాస్టర్​ ప్లాన్​ - IPL తరహాలో టీ10 లీగ్​కు శ్రీకారం! - bcci secretary jai shah

BCCI Planning T10 League Like IPL : బీసీసీఐ మరో మాస్టర్​ ప్లాన్​ వేస్తోంది. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్​ను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలు మీకోసం.

BCCI Planning T10 League Like IPL
BCCI Planning T10 League Like IPL
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 4:51 PM IST

Updated : Dec 15, 2023, 6:07 PM IST

BCCI Planning T10 League Like IPL : ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ - ఐపీఎల్ తరహాలో మరో లీగ్​కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్​ విజయంతో ఈ లీగ్​ రూపకల్పన చేసే పనిలో బీసీసీఐ కార్యదర్శి జై షా నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే స్పాన్సర్లు, వాటాదారులు కూడా ఈ ఆలోచనకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట. సెప్టెంబర్​-అక్టోబర్ మధ్యలో టైమ్​ విండో ఈ లీగ్​కు కేటాయించేందుకు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ టైర్​-2 క్రికెట్​ లీగ్​ను టీ10 ఫార్మాట్​లో నిర్వహించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2024లో తొలి ఎషిషన్​ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వినికిడి.

2008లో ఐపీఎల్​నుప్రారంభించారు. ఈ టీ20 ఫార్మాట్​ అనతి కాలంలోనే ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందింది. దాంతోపాటు బీసీసీఐకు స్పాన్సర్​షిప్​, బ్రాడ్​కాస్టింగ్​ హక్కుల రూపంలో కాసుల వర్షం కురిపించింది. ఐపీఎల్​ విజయంతో మిగతా దేశాలు కూడా ఇలాంటి లీగ్​ను ప్రారంభించాయి. అయితే ఈ ప్రతిపాదిక లీగ్​లో బీసీసీఐ పలు సమస్యలు ఎదుర్కొంటోంది.

  • అందులో మొదటగా కొత్త లీగ్​ను టీ10 ఫార్మాట్​లో తీసుకురావాలా లేదా టీ20 ఫార్మాట్​లో టైర్​-2 లీగ్​గా తీసుకురావాలా? అనే సందిగ్ధంలో పడింది.
  • ఐపీఎల్​ పాపులారిటీకి ఎఫెక్ట్​ కాకుండా ఈ లీగ్​లో ఆడబోయే ప్లేయర్లకు వయో పరిమితి విధించాలా లేదా?
  • ఈ లీగ్​కు ఫ్రాంచైజీలను కొత్త టెండర్​ ద్వారా ఎంపిక చేయాలా లేదా ఇప్పుడున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలకే ఆసక్తికనబరిచే / తిరస్కరించే హక్కు ఇవ్వాలా?
  • కొత్త లీగ్​ భారత్​లో జరుగుతుందా? లేక ప్రతి ఏడాది కొత్త వేదికలో జరుగుతుందా? అనే సమస్యలు ఉన్నాయి.

బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బోర్డు ఐపీఎల్​ వంటి కొత్త బిజినెస్​ మోడల్​ను ప్రారంభించాలనుకున్నప్పుడు ఫ్రాంచైజీలకు తిరస్కరించే హక్కు ఉంది. అయితే దానికి అనుగుణంగానే బీసీసీఐ నడుచుకునే అవకాశం ఉంది. అయితే ఫ్రాంచైజీలను ఒప్పిస్తే బీసీసీఐ ప్రారంభించాలనుకుంటున్న కొత్త లీగ్​కు మార్గం సుగమం అవుతుంది.

వన్డే క్రికెట్​కు గొడ్డలిపెట్టు!
ప్రస్తుతం పలు క్రికెట్​ బోర్డులు ద్వైపాక్షిక సిరీస్​ల హక్కుల ద్వారా దీర్ఘకాలంలో మనుగడ సాగించేదుకు కావాల్సిన ఆర్థిక వనరులను సాధించలేకపోతున్నాయి. ఇక బీసీసీఐతో రెవెన్యూ షేరింగ్​ మోడల్​లో జట్టు కడితే తాము మనుగడ సాగించవచ్చని ఆశపడుతున్నాయి. అయితే ఇప్పటికే కొన్నాళ్ల తర్వాత వన్డే క్రికెట్​ కనుమరుగు అయిపోతుందని క్రీడా విశ్లేషకులు, పలువురు మాజీలు భయం వ్యక్తం చేశారు. ఇక బోర్డులన్నీ జట్టు కట్టి కొత్త ప్రయోగాలకు సిద్ధమైతే వన్డే క్రికెట్ అంతం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

వరల్డ్​కప్​లో మెస్సీ​ ధరించిన జెర్సీలకు రికార్డు ధర- వేలంలో ఆరు టీషర్టులకు రూ.64 కోట్లు!

BCCI మాస్టర్​ ప్లాన్​ - IPL తరహాలో టీ10 లీగ్​కు శ్రీకారం!

Last Updated : Dec 15, 2023, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.