ETV Bharat / sports

BCCI News Today: బీసీసీఐకి షాక్‌.. కీలక అధికారి రాజీనామా

BCCI News Today: బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

BCCI News Today
బీసీసీఐ న్యూస్​
author img

By

Published : Dec 18, 2021, 9:02 PM IST

BCCI News Today: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి షాక్‌ తగిలింది. బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తన నోటీసు పీరియడ్‌ నవంబర్ 30తో పూర్తయిందని, అయితే ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు ముగిసే వరకు తన సేవలను కొనసాగించానని సాల్వీ పేర్కొన్నారు. బీసీసీఐలో ఆయన కీలకమైన అధికారిగా ఉన్నారు. ఆటగాళ్ల వయస్సు నిర్ధారణ, యాంటీ డోపింగ్, మెడికల్ విభాగానికి సాల్వి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న అండర్‌-16 బాయ్స్‌ నేషనల్ ఛాంపియన్‌ షిప్‌ (విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ)కి ముందు ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Abhijit Salvi BCCI: 'బీసీసీఐతో నా 10 సంవత్సరాల ప్రయాణం అద్భుతంగా సాగింది. కానీ, విభిన్నంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. కరోనా మహమ్మారి స‌మ‌యంలో పనిచేయడం సవాలుగా మారింది. దాదాపు అన్ని టోర్నమెంట్లను కొన‌సాగించాం. దేశవాళీ క్రికెట్‌ కూడా బాగా ముందుకుసాగుతోంది. దీని పట్ల సంతోషంగా ఉన్నాను' అని సాల్వి అన్నారు.

ఇదీ చదవండి: WFI President: యువ రెజ్లర్​ చెంపపై కొట్టిన ఎంపీ.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.