ETV Bharat / sports

IPL: ఐపీఎల్​ కోసం​ సీపీఎల్ షెడ్యూల్లో మార్పు!

కరేబియన్​ ప్రీమియర్​ లీగ్​ను​ రీషెడ్యూల్​ కోసం బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెస్టిండీస్​ బోర్డుతో చర్చలు జరుపుతోంది. సీపీఎల్​ షెడ్యూల్​ ప్రకారం జరిగితే అందులో పాల్గొనే ఆటగాళ్లు.. ఐపీఎల్​​​ రెండో దశ ప్రారంభ మ్యాచ్​లకు దూరమయ్యే అవకాశముంది.

author img

By

Published : May 30, 2021, 2:08 PM IST

BCCI
CPL​ రీషెడ్యూల్​

కరేబియన్​ ప్రీమియర్ లీగ్​ను(CPL​) అనుకున్న షెడ్యూల్​ ప్రకారం కన్నా వారం లేదా పదిరోజుల పాటు ముందస్తుగా నిర్వహించాలని వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డుకు బీసీసీఐ(BCCI) విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని మన బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దీని గురించి ఇరుదేశాల బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారం సీపీఎల్,​ ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 19వరకు జరగాలి. మరోవైపు యూఏఈలో జరిగే ఐపీఎల్​(IPL) రెండో దశ సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కరోనా నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా దుబాయ్​ చేరుకోగానే మూడు రోజులు తప్పనిసరి క్వారంటైన్​లో ఉండాలి. ఒకవేళ ఇదే సమయానికి సీపీఎల్​ ఉంటే అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​లకు దూరమవ్వాల్సి వస్తుంది. అందుకే కరేబియన్​ లీగ్​ త్వరగా ముగిసేలా రీషెడ్యూల్​ చేయాలన్న ప్రతిపాదనను వెస్టిండీస్ బోర్డు ముందు బీసీసీఐ ఉంచింది.

"వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డుతో చర్చలు జరపుతున్నాం. సీపీఎల్​ త్వరగా ముగిస్తే, అక్కడి బబుల్​ నుంచి ఐపీఎల్​ బుడగలోకి మారడం, మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేయడం ఆటగాళ్లకు సులువు అవుతుంది."

-బీసీసీఐ అధికారి

ఆల్​రౌండర్​ కీరన్ ​పొలార్డ్​, క్రిస్​గేల్(Gayle), డ్వేన్​ బ్రావో, సిమ్రాన్​ హెట్​మెయర్​, జాసన్​ హోల్డర్​, నికోలస్​ పూరన్​, ఫాబియన్​ అలెన్​, కీమో పాల్​, సునీల్​ నరైన్​, త్రినిదాద్​, బ్రెండన్​ మెక్​ కల్లమ్​ సీపీఎల్​లో పాల్గొననున్నారు. ఒకవేళ వెస్టిండీస్​ బోర్డు.. బీసీసీఐ ప్రతిపాదనను అంగీకరించకపోయినా ఐపీఎల్​ సెప్టెంబరు 18 నుంచి జరిగినా ఈ ఆటగాళ్లంతా కొన్ని ఐపీఎల్​ మ్యాచ్​లకు దూరమవ్వక తప్పదు.

ఇదీ చూడండి:సచిన్​ కెరీర్​లో ఆ రెండు విషయాలు కలగానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.