ETV Bharat / sports

IPL 2021: ప్రసారహక్కుల ద్వారా రూ.36 వేల కోట్లు! - ఐపీఎల్ బ్రాడ్​కాస్టింగ్ రైట్స్

ఐపీఎల్​ ఆదాయం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రాడ్​కాస్టింగ్ హక్కుల విలువ డబుల్​ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడొస్తున్న మొత్తం కంటే రెట్టింపు డబ్బులు బీసీసీఐ సొంతం కానున్నాయి. ఇంతకీ ఆ మొత్తం ఎంతంటే?

BCCI broadcasting rights
బీసీసీఐ బ్రాడ్​కాస్టింగ్ రైట్స్
author img

By

Published : Oct 22, 2021, 8:35 AM IST

Updated : Oct 22, 2021, 9:06 AM IST

ఐపీఎల్​ బ్రాడ్​కాస్టింగ్ రైట్స్ (ipl broadcasting rights) ద్వారా బీసీసీఐకి రెట్టింపు ఆదాయం రానుంది. వచ్చే ఐదేళ్ల కాలవ్వవధికి (2023-2027)కి దాదాపు రూ.36,000 కోట్లు అర్జించనుంది. లీగ్​లోకి రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో వీటి బిడ్డింగ్ ద్వారా అధిక మొత్తమే రానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం(2018-2022) ఐపీఎల్​ బ్రాడ్​కాస్టింగ్ రైట్స్​ స్టార్​ ఇండియా కలిగి ఉంది. దీని విలువ రూ.16,347 కోట్లు. కానీ రాబోయే కాలానికి ఆ విలువ కాస్త రెట్టింపు కంటే ఎక్కువగానే ఉంటుందని సంబంధిత వర్గాల సమాచారం. అదీగాక ఈసారి రెండు కొత్త టీమ్​లో ఐపీఎల్​లో వస్తున్నాయి. దీని బిడ్డింగ్ విలువ రూ.7,000 నుంచి రూ.10,000 కోట్ల వరకు పలుకనుంది. వీటి చేరికతో ఆడే మ్యాచ్​ల సంఖ్య 74కు చేరనుంది. దీని కారణంగా బ్రాడ్​కాస్టింగ్ విలువ కూడా పెరుగుతుందని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా ఆధారిత సంస్థ కూడా బ్రాడ్​కాస్టింగ్ రైట్స్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.

టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్​, రేడియో, సోషల్ మీడియా.. ఇలా వివిధ బ్రాడ్​కాస్టింగ్ డీల్స్​ను (BCCI broadcasting rights) బీసీసీఐ కలిగి ఉంటుంది. వీటి బ్రాడ్​కాస్టింగ్ రైట్స్​ టెండర్​ను అక్టోబర్​ 25న బీసీసీఐ విడుదల చేయనుంది. అదే రోజు రెండు కొత్త ఐపీఎల్ టీమ్​లను ప్రకటించనుంది. బ్రాడ్​కాస్టింగ్​ రైట్స్​ దక్కించుకోవడానికి సోనీ, స్టార్ ఇండియా రెండూ వేలంలో ఉంటాయని తెలుస్తోంది.

అటు.. బీసీసీఐ కొత్తగా ప్రకటించిన ఐపీఎల్ జట్లను సొంతం చేసుకోవడానికి పెద్ద కార్పొరేట్ కంపెనీలు బిడ్డింగ్​లో పాల్గొనున్నాయి. రాజస్థాన్ రాయల్స్​ టీమ్​లో 15 శాతం వాటా ఉన్న రెడ్​ బర్డ్​ క్యాపిటల్స్​ కూడా పోటీలో ఉండనుందని సమాచారం. ఇండియన్ మాజీ క్రికెటర్ కూడా ఐపీఎల్ టీమ్​ను సొంతం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారట.

ఇదీ చదవండి: అవినీతి కూపంగా హెచ్​సీఏ.. సుప్రీం వ్యాఖ్యలతో కొత్త ఆశలు

Last Updated : Oct 22, 2021, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.