ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల మొదటి వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని తెలిపింది. తొలి వన్డే మ్యాచ్కు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తాడని పేర్కొంది. కాగా, మొదటి వన్డే మార్చి 17న ముంబయిలో జరగనుంది. రెండో మ్యాచ్ 19 మార్చి విశాఖపట్నంలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరగనున్నాయి. ఇక, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న ముడు, నాలుగు టెస్టులకు కూడా జట్టును బీసీీసీఐ ప్రకటించింది.
భారత వన్డే జట్టు vs ఆస్ట్రేలియా : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్య(వీసీ), జడేజా, కూల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.
భారత టెస్టు జట్టు vs ఆస్ట్రేలియా : రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్(కీపర్), ఇషన్ కిషన్(కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా, షమీ, సిరాజ్, సూర్య కుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, ఉనద్కత్