ETV Bharat / sports

బిగ్​బాష్​ లీగ్​.. ఒక్క బంతికే 16 పరుగులు.. ఎంత పని చేశావయ్యా జోయల్​!

బిగ్​బాష్​ లీగ్​లో ఓ బౌలర్​.. ఒక బంతికి ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే!. ఇంతకీ అదెలా జరిగిందంటే?

bbl-2022-23-joel-paris-concedes-16-runs-1-ball-while-bowling-steve-smith

author img

By

Published : Jan 23, 2023, 7:33 PM IST

సాధారణంగా ఓ బంతికి 7 పరుగులు (నోబాల్‌+సిక్స్‌), మహా అయితే 13 పరుగులు (నోబాల్‌+సిక్స్‌+సిక్స్‌) రావడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఓ బంతికి ఏకంగా 16 పరుగులు వచ్చాయి. దీంతో ఇదెలా సాధ్యపడిందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆరా తీయడం మొదలుపెట్టారు.

వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ బౌలర్‌ జోయల్‌ పారిస్‌ ఓ బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిక్సర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ వేసిన పారిస్‌.. తొలి రెండు బంతులను డాట్‌ బాల్స్‌ వేశాడు. ఆ తర్వాత బంతిని స్టీవ్‌ స్మిత్‌ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు.

దీంతో బంతి కౌంట్‌ కాకుండానే సిక్సర్స్‌ జాబితాలో 7 పరుగులు చేరాయి. ఆ తర్వాత బంతికి కూడా 5 పరుగులు (వైడ్‌+ఫోర్‌) రావడంతో బంతి కౌంట్‌లోకి రాకుండానే సిక్సర్స్‌ ఖాతాలో 12 పరుగులు జమయ్యాయి. ఇక పారిస్‌ నెక్స్‌ వేసిన లీగల్‌ బంతిని స్మిత్‌ బౌండరీకి తరలించడంతో ఒక్క బంతి పూర్తయ్యే సరికి సిక్సర్స్‌ ఖాతాలో 16 పరుగులు వచ్చి పడ్డాయి. ఈ రేర్‌ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

కాగా, ఈ మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్‌.. తమ కోటా ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.