ETV Bharat / sports

KOHLI ANUSHKA: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ ఛాలెంజ్ - virat kohli bat balance challenge

తన భర్త కోహ్లీతో కలిసి ఓ ఛాలెంజ్​లో పాల్గొంది నటి అనుష్కశర్మ. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి? దాని వెనుకున్న కథేంటి?

Anushka Sharma joins the trend with Virat Kohli
కోహ్లీ అనుష్క శర్మ
author img

By

Published : Jul 2, 2021, 4:17 PM IST

ప్రస్తుతం ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా ఆటగాళ్లు.. టెస్టు సిరీస్​కు ముందు విరామం దొరకడం వల్ల ఎంజాయ్ చేస్తున్నారు. లండన్​ పరిసర ప్రాంతాల్లోని పర్యటక ప్రదేశాలకు, వింబుల్డన్​ మ్యాచ్​లు చూస్తూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ మాత్రం తన భార్య అనుష్క శర్మతో కలిసి బ్యాట్ బ్యాలెన్స్ ఛాలెంజ్​లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను అనుష్క, తన ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

కొన్నాళ్ల క్రితం ఓ వీడియో షేరింగ్​ యాప్​తో ఒప్పందం కుదుర్చుకున్నకోహ్లీ.. సదరు యాప్​లో షార్ట్ వీడియోలు చేస్తూ అభిమానులకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇందులో భాగంగా తన భార్యతో కలిసి బ్యాట్​ బ్యాలెన్స్ ఛాలెంజ్​లో పాల్గొన్నాడు.

ప్రస్తుతం భర్తతో కలిసి ఇంగ్లాండ్​లో ఉన్న అనుష్క.. మరోవైపు రెండు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. జులాన్ గోస్వామి బయోపిక్​తో పాటు నవ్​దీప్ సింగ్ దర్శకత్వంలో పనిచేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.