శ్రీలంకపై గత పదిమ్యాచ్ల్లో(అన్ని ఫార్మాట్లలో కలిపి) ఒక్క విజయాన్ని నమోదుచేయని బంగ్లాదేశ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆ చెత్త రికార్డుకు బ్రేక్ చెబుతూ లంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లా శుభారంభం చేసింది. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో 33 పరుగుల తేడాతో గెలుపొందింది ఇక్బాల్ సేన. మెహిదీ హసన్ మిరాజ్ 4, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3, సైఫుద్దీన్ 2 వికెట్లతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు శుభారంభమేమీ లభించలేదు. ఓపెనర్ లిటన్ దాస్ డకౌటయ్యాడు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (52)తో పాటు ముష్ఫికర్ రహీమ్(84), మహ్మదుల్లా(54) హాఫ్ సెంచరీలతో జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించారు. లంక బౌలర్లలో ధనుంజయ డిసిల్వా 3, చమీరా ఒక వికెట్‌తో రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెరీరా సేన తడబాటుకు గురైంది. బంగ్లా బౌలర్ల ధాటికి 48.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు గుణతిలక-పెరీరా జోడీ ఓ మోస్తరుగా రాణించారు. చివర్లో వహిందు హసరంగ(74) పోరాడాడు. అయినా లాభం లేకుండా పోయింది. బంగ్లా బ్యాట్స్‌మన్ రహీమ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో వన్డే మంగళవారం జరగనుంది.
ఇదీ చదవండి: త్వరలోనే వారికి ప్రపంచకప్ ప్రైజ్‌మనీ