ETV Bharat / sports

IND VS BAN: గాయపడ్డ కెప్టెన్​​.. ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలింపు​ - లంక ప్రీమియర్ లీగ్​లో గాయాలు

టీమ్​ఇండియాతో టెస్టు సిరీస్​కు ​ముందు బంగ్లాదేశ్​ కెప్టెన్​ గాయపడ్డాడు. అతడిని ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు లంక ప్రీమియర్​ లీగ్​లో యంగ్ ప్లేయర్​ ఆజాం ఖాన్​ తీవ్రంగా గాయపడ్డాడు.

Bangladesh captain  shakib al hassan  injured and taken him to hospital
IND VS BAN: గాయపడ్డ కెప్టెన్​​.. ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలింపు​
author img

By

Published : Dec 13, 2022, 3:10 PM IST

శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆటగాళ్లు వరుసగా గాయాల బారినపడుతున్నారు. లంక ప్లేయర్​ చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకున్న ఘటన మరవక ముందే.. మరో సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్​ యువ ఆటగాడు ఆజాం ఖాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే?.. లంక ప్రీమియర్‌ లీగ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌కు ఆజాం ఖాన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గాలే గ్లాడియేటర్స్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన నువాన్ ప్రదీప్‌.. మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న ఆజాం ఖాన్‌ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచానా వేయడంలో అజం విఫలమవ్వడంతో.. అది నేరుగా అతడి తలకి తాకింది. దీంతో నేలపై పడుకుని అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజెయో వచ్చి అతడిని పరిశీలించాడు. అతడిని స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. అతడిని ఆసుపత్రికి తరలించిన వెంటనే స్కానింగ్‌ చేశారు. స్కాన్‌ రిపోర్టులు పరిశీలించిన వైద్యలు అతడు బాగానే ఉన్నాడని తెలిపారు. దీంతో పాక్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆజాం ఖాన్‌ పాకిస్థాన్​ దిగ్గజం మొయీన్ ఖాన్ తనయడు అన్న సంగతి తెలిసిందే.

ఆంబులెన్స్​లో బంగ్లా కెప్టెన్​.. టీమ్​ఇండియాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌.. ఇప్పుడు టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బుధవారం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హాసన్‌ గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ చేస్తుండగా షకీబ్‌ తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దీంతో బంగ్లా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

"షకీబ్‌ గాయం అంత తీవ్రమైనది కాదు. ఇతర ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేనందున అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపాల్సి వచ్చింది. అతడికి కండరాలు పట్టేశాయి. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. షకీబ్‌ తిరిగి ఆఖరి ప్రాక్టీస్‌ సెషన్‌కు జట్టుతో చేరుతాడు" అని బీసీబీ అధికారి పేర్కొన్నారు. కాగా టీమ్​ఇండియాతో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ సొంతం చేసుకోవడంలో షకీబ్‌ కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చూడండి: మెస్సి రిటైర్మెంట్‌ అంటూ ప్రచారం.. ఈ సారి ప్రపంచకప్​ గెలుస్తాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.