పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన ట్వీట్, అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. తన జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నట్లు ఇందులో పేర్కొన్నాడు. 'బాబర్ కీ కహానీ' పేరుతో ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. కానీ, అది పుస్తకమా, సినిమానా అనేది మాత్రం స్పష్టం చేయలేదు.
-
Meri kahani, stay tuned! #BabarKiKahani pic.twitter.com/g3QapD3TJ8
— Babar Azam (@babarazam258) June 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Meri kahani, stay tuned! #BabarKiKahani pic.twitter.com/g3QapD3TJ8
— Babar Azam (@babarazam258) June 4, 2021Meri kahani, stay tuned! #BabarKiKahani pic.twitter.com/g3QapD3TJ8
— Babar Azam (@babarazam258) June 4, 2021
అయితే దీనిపై చాలా మంది ఫ్యాన్స్ రీట్వీట్లు చేస్తున్నారు. ఇది సినిమా? బయోపిక్? ఆత్మకథ? అనేది బాబర్ స్పష్టం చేయలేదు. దీంతో తమ అభిమాన క్రికెటర్ ట్వీట్‌పై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు అభిమానులు. బాబర్ వ్యక్తిగత జీవితం గురించి కూడా ట్విట్టర్లో ప్రస్తావిస్తున్నారు. తన సుదూర బంధువు కూతురును అతడు వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు పేర్కొన్నారు.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బాల్‌బాయ్‌గా కెరీర్‌గా ప్రారంభించిన బాబర్ జీవితం స్ఫూర్తిదాయకమనే చెప్పొచ్చు. తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. 2015లో క్రికెట్ అరంగేట్రం చేసిన అజామ్.. అనతికాలంలోనే పాకిస్థాన్ జట్టులో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2019లో టీ20 టీమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 2020లో జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో సారథ్యం తీసుకున్నాడు.
ఇదీ చదవండి: 'పంత్ కూడా సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్ లాంటివాడే'