పాక్ సారథి బాబార్ అజామ్ కొత్త రికార్డు సాధించాడు. ఆ దేశ జట్టుకు కెప్టెన్‌గా ఆడిన మొదటి నాలుగు టెస్టుల్లో విజయం సాధించి, ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి పాక్ సారథిగా నిలిచాడు. సోమవారం జరిగిన రెండో టెస్టులో జింబాబ్వేపై ఇన్నింగ్స్ 147 పరుగులు తేడాతో పాకిస్థాన్ గెలిచింది. ఫలితంగా 2-0 తేడాతో టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ విజయంతోనే ఈ ఘనత అందుకున్నాడు బాబర్.
అలానే పాక్ జట్టు మరో ఘనత కూడా సాధించింది. ఓ ఏడాదిలో వరుసగా ఆరుసార్లు లేక అంతకంటే ఎక్కువ సిరీస్‌ల్లో విజయం సాధించడం దాయాది జట్టుకు ఇది ఆరోసారి కావడం విశేషం. అంతకుముందు 1993-94(6), 2001-02(6), 2011-12(13), 2015-16(9), 2017-18(6) వరుస సిరీస్‌ల్లో విజయాలు అందుకుంది.
క్లీన్‌స్వీప్
జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేంది పాకిస్థాన్. ఈ విజయంలో అబిద్ అలీ(215), అజహర్ అలీ(126), నౌమాన్ అలీ(97) కీలకపాత్ర పోషించారు. సోమవారంతో పూర్తయిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 147 పరుగలు తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తుచేసింది పాక్. ఫాలోఆన్ ఆడుతూ సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 220/9తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జింబాబ్వే.. మరో 11 పరుగులు చేసి ఓడిపోయింది. పాక్ 510/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఇదీ చూడండి: బాబర్‌కు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు