ETV Bharat / sports

Ind vs Aus: మళ్లీ ఓడిన టీమ్​ఇండియా.. ఆస్ట్రేలియాదే సిరీస్​

ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళా జట్టు ఓటమితో ముగించింది. మూడో టీ20లోనూ ఓడిపోయింది.

Australia Women Beat India Women
టీమ్​ఇండియా vs ఆస్ట్రేలియా
author img

By

Published : Oct 10, 2021, 6:49 PM IST

ఆస్ట్రేలియాతో చివరిదైన మూడో టీ20లోనూ టీమ్​ఇండియా మహిళా జట్టు ఓడిపోయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో 14 పరుగుల తేడాతో అతిథ్య జట్టు విజయం సాధించింది.

Australia Women Beat India Women
ఆస్ట్రేలియా మహిళా జట్టు

టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బెత్ మూవీ అత్యధికంగా 61 పరుగులు చేసింది. చివర్లో వచ్చిన తహిలా మెక్​గ్రాత్ 44 పరుగులతో అదరగొట్టింది. మిగిలిన వారిలో లానింగ్ 14, వార్​హెమ్ 13 పరుగులు చేశారు. టీమ్​ఇండియా బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, రేణుక, పూజా, దీప్తి తలో వికెట్ తీశారు.

ఛేదనలో భారత్ 20 ఓవర్లు పూర్తిగా ఆడి 135 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ స్మృతి మంధాన 52, జెమీమా 23, రిచా ఘోష్ 23 మాత్రమే బాగా ఆడారు. మిగిలిన బ్యాట్స్​ఉమెన్ తేలిపోవడం వల్ల మ్యాచ్​తో పాటు సిరీస్​ కూడా చేజారిపోయింది.

Australia Women Beat India Women
ఓపెనర్ స్మృతి మంధాన

తొలి మ్యాచ్​ వర్షం కారణంగా రద్దవగా, తర్వాత రెండు టీ20ల్లోనూ ఆసీస్ విజయం సాధించింది. అంతకుముందు మూడు వన్డేల సిరీస్​లోనూ భారత్ 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.