ETV Bharat / sports

ఆసీస్​ దిగ్గజం షేన్​ వార్న్​కు బైక్​ యాక్సిడెంట్​

Shane Warne Accident: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్​ వార్న్​ బైక్​ నడుపుతూ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయాలైనట్లు వార్న్ వెల్లడించాడు.

shane warne
షేన్ వార్న్
author img

By

Published : Nov 29, 2021, 12:21 PM IST

Shane Warne Accident: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్​కు యాక్సిడెంట్ అయింది. ఆదివారం(నవంబర్ 28) బైక్​పై​ వెళ్తుండగా అతడు అదుపు తప్పి కిందపడిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో షేన్ వార్న్​ తనయుడు జాక్సన్​ కూడా బైక్​పై ఉన్నట్లు తెలిపాడు.

అయితే.. యాక్సిడెంట్​లో స్వల్ప గాయాలైనట్లు షేన్​ వార్న్ వెల్లడించాడు. చెకప్​ కోసం ఆసుపత్రికి కూడా వెళ్లినట్లు స్పష్టం చేశాడు. అయితే.. డిసెంబర్ 8న గబ్బా వేదికగా జరగనున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ యాషెస్​ సిరీస్​ తొలి టెస్టుకు కామెంట్రీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు.

గొప్ప బౌలర్​గా రాణించి..

ఆసీస్​ మాజీ ఆటగాడు కెరీర్​లో గొప్ప బౌలర్​గా నిలిచాడు. 145 టెస్టులు, 194 వన్డేలకు ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు సారథిగా ఉన్నాడు షేన్​ వార్న్. 2008లో వార్న్​ సారథ్యంలోనే ఆ జట్టు తొలిసారిగా కప్​ గెలిచింది.

ఇదీ చదవండి:

Pat Cummins Captain:ఆస్ట్రేలియా టెస్టు సారథిగా కమిన్స్

Aus vs Eng Ashes 2021: యాషెస్ మ్యాచ్​లు ఇక తెలుగులో.. ఇదే తొలిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.