WTC Final 2023 australia in england test series : మరో నాలుగు రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు జరగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్ఇండియా- ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచి.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని కంగారు జట్టు భావిస్తోంది. అయితే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఓ విషయం ఆసీస్‌ను బాగా కలవరపెడుతోంది. అదేంటంటే.. ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. టెస్టు క్రికెట్లో లార్డ్స్, హెడ్డింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్‌లలో చారిత్రాత్మక విజయాలు నమోదు చేసింది. కానీ ఓవల్ స్టేడియంలో మాత్రం సరైనా ట్రాక్ రికార్డ్ లేదు. ఆ వేదికపై విఫలమైంది.
australia vs india oval : 1880 నుంచి ఓవల్ స్టేడియంలో 38 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా.. కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలను అందుకుంది. ఓవల్‌లో ఆస్ట్రేలియా జట్టుకు విజయ శాతం కేవలం 18.42 మాత్రంగా ఉంది. ఇంగ్లాండ్‌లోని స్టేడియాల్లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప విజయ శాతం. ఇక ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా గత 50 ఏళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఆసీస్‌ను కలవరపెడుతోంది.
అయితే లార్డ్స్‌లో మాత్రంలో ఆస్ట్రేలియా టీమ్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. లార్డ్స్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. 17 మ్యాచ్‌ల్లో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో ఆసీస్ విజయ శాతం 43.59గా నమోదైంది. ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక విజయ శాతం.
australia vs india test : పేసర్లకు అనుకూలంగా.. కాగా, టీమ్ఇండియాను ఎదుర్కొనేందుకు... కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అక్కడికి చేరుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. అయితే ఓవల్ పిచ్ మాత్రం పేసర్లను బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇరు జట్లు కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంటుంది. టీమ్ఇండియాలో పేసర్లు షమి, సిరాజ్, జైదేవ్ ఉనద్కత్, శార్దూల్, ఉమేశ్ ఉన్నారు.
ఇదీ చూడండి :
WTC Final 2023 : ఓవల్‌లో వారిదే ఆధిపత్యం.. టీమ్ఇండియా పేసర్లు ఏం చేస్తారో?
WTC Final డ్రా అయితే విజేేత ఎవరు? వర్షం పడితే ఎలా? దాదా కామెంటరీ ఉందా?