Pat Cummins Ashes 2023 : ప్రతిష్ఠాత్మక యాషెస్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు చివరి సెషన్లో 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. 'బజ్‌బాల్' సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆతిథ్య జట్టును ఇటీవలే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా అవతరించిన కంగారూల టీమ్ అనూహ్య రీతిలో మట్టికరిపించింది.
2015లో చివరిసారిగా టైటిల్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్.. ఈసారైనా ట్రోఫీని దక్కించుకోవాలనే ఆశతో బరిలోకి దిగింది. కానీ, ఆసీస్‌లోని బలమైన ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌కు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లైయన్ల అద్భుత భాగస్వామ్యం ఆ జట్టును విజయ తీరాలకు చేర్చింది. అయితే ఆట ఆఖరిరోజు చివరి సెషన్లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న కెప్టెన్ పాట్ కమిన్స్ మైదానంలో విక్టరీ రన్‌ను ఆస్వాదిస్తూ కనిపించాడు. విన్నింగ్ రన్ కొట్టిన వెంటనే కమిన్స్ తన తలపై ఉన్న హెల్మెట్‌ను, చేతిలో ఉన్న బ్యాట్‌ను విసిరి అవతల విసిరిశాడు. అనంతరం అక్కడే ఉన్న నాథన్ లైయన్‌ను ఎత్తుకొని తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాలుగో రోజు ఆట చివరికి ఆస్ట్రేలియా స్కోరు 107/3. ఆ జట్టు విజయానికి ఇంకా 174 పరుగులు కావాలి. ఇంగ్లాండ్ విజయానికి అవసరమైన వికెట్లు 7. సాధారణంగా మధ్యాహ్నానికే మ్యాచ్ ఫలితం తేలిపోవాలి. కానీ వరుణుడి దోబూచులాట మధ్య మధ్యాహ్నం వరకు ఫలితంపై ఉత్కంఠ తప్పలేదు. తొలి సెషన్ అంతా వర్షం వల్ల తుడిచిపెట్టుకోవడంతో రసవత్తర మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ రెండో సెషన్లో వర్షం ఆగిపోవడంతో ఆటకు మార్గం సుగమమైంది.
-
The iconic finish this match deserved 🤌
— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📹 | Relive the winning moment from an exhilarating 1st Test in #TheAshes 🤩#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/qTQ9RiWGQg
">The iconic finish this match deserved 🤌
— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2023
📹 | Relive the winning moment from an exhilarating 1st Test in #TheAshes 🤩#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/qTQ9RiWGQgThe iconic finish this match deserved 🤌
— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2023
📹 | Relive the winning moment from an exhilarating 1st Test in #TheAshes 🤩#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/qTQ9RiWGQg
గట్టేక్కించిన ద్వయం..
Ashes Series 2023 : మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా తలపడుతూ వచ్చిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆఖరి రోజు తమ పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో కమిన్స్, లియాన్ ఇద్దరూ కలిసి 9వ వికెట్‌కు అజేయంగా 55 రన్స్ జోడించి అనూహ్య విజయాన్ని కంగారూల ఖాతాలో పడేలా చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ సాధించిన ఓపెనర్ ఖవాజా .. మరో మేటి ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చేజారుతున్న దశలో కెప్టెన్ కమిన్స్.. లైయన్‌తో కలిసి గొప్పగా పోరాడి ఆసీస్‌ను గెలిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ రాణించారు. ఖవాజాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. కాగా, అయిదు టెస్టుల సిరీస్‌లో తర్వాతి మ్యాచ్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది.