ETV Bharat / sports

Ashes 2023 : ఆసిస్​, ఇంగ్లాండ్​ జట్లకు ఐసీసీ బిగ్​ షాక్​ ! - యాషెస్ 2023 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా

యాషెస్​ గెలుపును ఆస్వాదిస్తున్న ఆసీస్‌ జట్టుకు భారీ షాక్​ ఇచ్చింది ఐసీసీ. మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మేయింటన్‌ చేసినందుకు ఆసిస్​ పాటు ప్రత్యర్థి జట్టుుపై ఐసీసీ ఫైర్​ అయ్యి జరిమానా విధించింది.

ashes 2023 icc
ashes 2023 icc
author img

By

Published : Jun 21, 2023, 2:31 PM IST

Ashes icc Fine : యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్​లో స్లోగా ఓవ‌ర్​ రేట్​ ప్రదర్శించినందుకు ఇరు జ‌ట్ల‌కు ఐసీసీ జ‌రిమానా విధించింది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇరు జ‌ట్లు నెమ్మ‌దిగా బౌలింగ్ చేసిన‌ట్లు ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక నుంచి రెండు జ‌ట్లు.. చెరో రెండేసి పాయింట్లను కోల్పోనున్నాయి. అంతే కాకుండా ఇరు జ‌ట్ల ఆట‌గాళ్ల‌కు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత కూడా విధించినట్లు ప్రకటించారు. కేటాయించిన స‌మ‌యంలోపు రెండు ఓవ‌ర్లు త‌క్కువ‌గా వేశార‌ని మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆ జ‌రిమానా కట్టేందుకు అంగీక‌రించారు.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లకు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే.. ప్రతీ ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధింస్తారు. ఈ క్రమంలో 2 రెండు ఓవర్లు ఆలస్యమైనందున మ్యాచ్​ ఫీజ్​లో 40 శాతం జరిమానా విధించారు.

అదే విధంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. ప్రతీ ఓవర్‌ లేటుకు వారి డబ్ల్యూటీసీ పాయింట్లలో ఓ పాయింట్‌ కొత విధిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఇరు జట్లు చెరో రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కోల్పోయాయి.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. యాషెస్‌ సిరీస్‌-2023లో భాగంగా జరిగిన తొలి టెస్ట్​లో ఆస్ట్రేలియా విజయ పతకాన్ని ఎగరేసింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో ఆసిస్​ జట్టు గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు కీలక విజయాన్ని అందించగా.. అతడితో పాటు ఖ్వాజా కూడా ​మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టు స్కోర్​ పెంచాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.