ETV Bharat / sports

Asia Cup Team India Players list 2023 : జట్టు ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్​గా రోహిత్​ శర్మ.. హైదరాబాదీ క్రికెటర్​కు చోటు - ఆసియా కప్​ 2023 తుది జట్టు

Asia Cup Team India Players list 2023 : మరి కొద్ది రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్​ కమిటీ. ఆ వివరాలు..

Asia Cup Team India Players list 2023
ఆసియా కప్​ 2023
author img

By

Published : Aug 21, 2023, 1:43 PM IST

Updated : Aug 21, 2023, 2:56 PM IST

Asia Cup Team India Players list 2023 : ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక పోటీలో పాల్గొనే భారత జట్టును అజిత్​ అగార్కర్​ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దిల్లీలో తాజాగా జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఈ జట్టును ఖారారు చేశారు. ఈ మీటింగ్‌లో టీమ్​ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా పలువురు పాల్గొన్నారు.

ఈ మీటింగ్​లో కమిటీ.. 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నిలో టీమ్​ఇండియా జట్టుకు రోహిత్​ శర్మ నాయకత్వ బాధ్యతలు చేపట్టగా.. ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య వైస్​​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. గాయాలతో కోలుకుంటున్న కె.ఎల్‌.రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఈ టోర్నీతో పునరాగమనం చేస్తున్నారు. అలాగే ఇటీవలే ఐర్లాండ్​ టీ20లో చెలరేగిపోయిన జస్ప్రీత్​ బుమ్రా కూడా ఆసియా కప్​లో టీమ్​ఇండియా తరఫున ఆడనున్నాడు. హైదరాబాదీ క్రికెటర్​ తిలక్​ వర్మకు కూడా ఈ తుది జట్టులో చోటు దక్కడం విశేషం.

  • #WATCH | At the moment, Rohit Sharma, Shubman Gill and Ishan Kishan are our preferred openers...Shikhar Dhawan has been a terrific player for India, says BCCI chief selector Ajit Agarkar. pic.twitter.com/TqF6gV4869

    — ANI (@ANI) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 Schedule : ఇక ఈ ఏడాది ఆసియాకప్​కు శ్రీలంక, పాకిస్థాన్​ ఆతిథ్యం ఇవ్వనుండగా.. మ్యాచ్​లన్నీ హైబ్రిడ్‌ మోడల్‌లలో జరగనుంది. ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్​ -నేపాల్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక భారత్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లు శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగనున్నాయి. సూపర్‌ -4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6 నుంచి మొదలుకాన్నాయి. ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి.

  • Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, KL Rahul, Ishan Kishan, Hardik Pandya (VC), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel, Kuldeep Yadav, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh Krishna

    Traveling stand-by…

    — BCCI (@BCCI) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup Team India Squad : టీమ్​ఇండియా తుది జట్టు : రోహిత్​ శర్మ (కెప్టెన్​), శుభ్​మన్​ గిల్​, విరాట్​ కోహ్లీ, సూర్య కుమార్​ యాదవ్​, తిలక్​ వర్మ, కె.ఎల్‌.రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జస్ప్రీత్​ బుమ్రా ఇషాన్​ కిషన్​, హార్దిక్​ పాండ్యా(వైస్​ కెప్టెన్​), రవీంద్ర జడేజా, అక్షర్​ పటేల్​, శార్దూల్​ ఠాకూర్​, మహ్మద్​ షమీ, మహ్మద్​ సిరాజ్​, కుల్దీప్​ యాదవ్​, ప్రసిద్ధ్​ కృష్ణ

Asia Cup 2023 : ఆసియా కప్​ టాప్​-4 ఇంట్రెస్టింగ్​ మ్యాచెస్​.. వీటిని అస్సలు డోంట్ మిస్

Asia Cup ODI Format : అప్పుడు టీ20.. ఇప్పుడు వన్డే.. ఆసియా కప్​లో ఈ ఛేంజ్​ ఏంటి ?

Last Updated : Aug 21, 2023, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.