ETV Bharat / sports

Asia Cup 2023 Pak vs Nepal : నేపాల్​పై పాక్​ పంజా.. భారీ తేడాతో బంపర్ విక్టరి - నేపాల్ జట్టు 2023 ఆసియా కప్

Asia Cup 2023 Pak vs Nepal : ఆసియా కప్​ 2023 తొలి మ్యాచ్​లో నేపాల్​పై.. పాకిస్థాన్ గెలుపొందింది. 238 పరుగుల భారీ తేడాతో విజయబావుటా ఎగురవేసింది.

Asia Cup 2023 Pak vs Nepal
Asia Cup 2023 Pak vs Nepal
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 9:48 PM IST

Updated : Aug 30, 2023, 10:18 PM IST

Asia Cup 2023 Pak vs Nepal : ఆసియా కప్​ 2023 తొలి మ్యాచ్​లో నేపాల్​పై పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన పాక్ బ్యాటర్లలో.. కెప్టెన్ బాబర్ అజామ్ (151 పరుగులు : 131 బంతుల్లో, 14x4, 4x6), ఇఫ్తికార్ అహ్మద్ (109 పరుగులు : 71 బంతుల్లో, 11x4, 4x6) శతకాలతో చెలరేగారు. ఫలితంగా పాక్​.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. తర్వాత ఛేదనలో పాక్​ బౌలర్ల ధాటికి.. నేపాల్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఫలితంగా నేపాల్ ఇన్నింగ్స్​ 104 పరుగులకే కుప్పకూలింది. పాక్​ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, హరీస్ రౌఫ్ 2, షహీన్ అఫ్రిదీ 2, ససీమ్​ షా, నవాజ్ తలో వికెట్​ పడగొట్టారు. ఇక సెంచరీతో కదం తొక్కిన బాబార్ అజామ్​కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

  • Babar Azam and Iftikhar Ahmed both scored centuries, while Shadab took 4 wickets as Pakistan outshone Nepal by a margin of 238 runs.

    The Men in Green have made a remarkable start in this edition of the Asia Cup 🇵🇰 #AsiaCup2023 #PAKvNEP pic.twitter.com/8YLyZlnBQw

    — AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్​కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 6.1 ఓవర్లకే పాక్ ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ఫకర్ జమాన్ (14) తన పేలవ ఫామ్​ను కొనసాగిస్తూ.. కరణ్ బౌలింగ్​లో ఔటయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ ఇమామ్​ ఉల్​ హక్.. రనౌట్​గా వెనుగిరిగాడు. ఇక కెప్టెన్ బాబర్(Babar Azam), వికెట్ కీపర్ రిజ్వాన్​ (44)తో కలిసి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు.

కానీ వీరి జోడీ 23.4 వద్ద విడిపోయింది. బాబర్​తో సమన్వయం కోల్పోయిన, రిజ్వాన్.. రనౌట్ అయ్యాడు. అవే నేపాల్​కు మ్యాచ్​లో చివరి సంతోష క్షణాలు అయ్యాయి. తర్వాత ఇఫ్తికార్​తో కలిసి బాబర్, 214 పరుగుల భాగస్వామ్యంతో పాక్​కు భారీ స్కోర్ అందించారు. నేపాల్ బౌలర్లలో సోంఫాల్ కామీ 2, కరణ్, లమిషానే తలో వికెట్ పడగొట్టారు.
ఇక నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామి (28), గుల్సన్ ఝా (13) ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. పైగా నేపాల్ ఇన్నింగ్స్​లో 3 డకౌట్​లు నమోదయ్యాయి.

  • What a knock! What a player! Babar Azam has once again proven why he's a force to be reckoned with in the world of cricket. His sensational 151 off 131 balls, including 14 fours and 4 sixes, demolished Nepal's bowling attack! 🇵🇰 💪#AsiaCup2023 #PAKvNEP pic.twitter.com/QKFJMann97

Ramiz Raja Commentary On Babar Azam : బాబర్​ అంటే చాలా ఇష్టం.. అతడిని పెళ్లి చేసుకుంటా : రమీజ్​ రజా

Asia Cup 2023 IND VS PAK : భారత్​తో మ్యాచ్​.. మాకు కావాల్సింది అదే బాసు అంటున్న పాక్​ కెప్టెన్

Last Updated : Aug 30, 2023, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.