Asia Cup 2023 Pak vs Bangladesh : 2023 ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో లాహోర్ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌తో తలపడింది. ఈ పోరులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని.. పాకిస్థాన్ 39.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (17) తక్కువ స్కోరుకే వెనుదిరిదినా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (78 పరుగులు), మహమ్మద్ రిజ్వాన్ (63 పరుగులు) రాణించారు. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సన్నివేశం కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నెట్టింట ట్రోల్స్‌కు గురౌతోంది. అదేంటంటే..
పాకిస్థాన్ ఇన్నింగ్స్ జరుగుతుండగా ఐదో ఓవర్ లాహోర్ గడాఫీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో మైదానంలో చీకటి ఏర్పడింది. అయినా ఈ లైట్లు వెంటనే వెలుగుతాయని అనుకున్నారంతా. కానీ సుమారు 20 నిమిషాల తర్వాతే మళ్లీ గ్రౌండ్లో వెలుగు వచ్చింది. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. పాకిస్థాన్ బోర్డుపై అవాకులు చవాకులు పేలుస్తున్నారు. 'నాలుగు మ్యాచ్‌లే సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ఇంకా టోర్నమెంట్ మొత్తం ఎలా జరిపేవారు' అంటూ.. పాక్ క్రికెట్ బోర్డుపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. అయితే 2023 ఆసియా కప్‌నకు పూర్తిగా పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. టీమ్ఇండియా ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ఒప్పుకోలేదు. ఈ కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్.. భారత్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడే విధంగా హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది.
Asia Cup 2023 Pakistan : ప్రస్తుత ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గ్రూప్ స్టేజ్‌లో నేపాల్‌పై అద్భుత విజయం నమోదు చేసిన పాక్.. తర్వాత టీమ్ఇండియాను సైతం కట్టడి చేయగలిగింది. కానీ ఈ మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. దీంతో ఇరుజట్లు చెరోపాయింట్ పంచుకున్నాయి. ఇక మూడు పాయింట్లతో అందరికంటే ముందే పాక్ సూపర్ 4 బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.
Asiacup 2023 IND VS Nepal : చెలరేగిన రోహిత్-గిల్.. నేపాల్‌పై భారత్ విక్టరీ.. సూపర్-4కు అర్హత
India Pakistan Series : 'భారత్-పాక్ సిరీస్ కోసం PCB డిమాండ్.. అంతా సర్కార్ చేతుల్లోనే!'