ETV Bharat / sports

Asia Cup 2023 IND VS SL : లంకతో మ్యాచ్​.. రోహిత్ శర్మ అరుదైన ఫీట్​ - రోహిత్ శర్మ వన్డేల్లో 10 వేల పరుగుల రికార్డ్

Asia Cup 2023 IND VS SL : శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ మైలురాయిని అందుకున్నాడు. ఆ వివరాలు..

Asia Cup 2023 IND VS SL : రోహిత్ శర్మ ఘనత..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 3:52 PM IST

Updated : Sep 12, 2023, 4:38 PM IST

Asia Cup 2023 IND VS SL : ఆసియా కప్‌ 2023లో మరో కీలక మ్యాచ్​ను టీమ్​ఇండియా ఆడుతోంది. పాకిస్థాన్​పై గెలుపు మత్తు దిగకముందే.. శ్రీలంకతో తలపడుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ పోరు కూడా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.జట్టులో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్​లోనూ టీమ్​ఇండియా ఓపెనర్లు రోహిత్ దూకుడుగా ఆడాడు. 48 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్​లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు.

Rohith Sharma 10000 Runs : ఈ క్రమంలోనే రోహిత్ శర్మ​ ఓ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగుల ఘనత సాధించిన 15వ క్రికెటర్​గా నిలిచాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్​గానూ నిలిచాడు. 248 మ్యాచుల్లోని 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుత మ్యాచ్​లో ఓ సిక్స్‌ బాది పదివేల పరుగులు దాటడం విశేషం.

రోహిత్‌ కన్నా ముందు ఎవరంటే..?

  • 10వేలకుపైగా పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
  • సచిన్ తెందుల్కర్‌ - 18,426
  • విరాట్ కోహ్లీ - 13,024
  • సౌరభ్‌ గంగూలీ - 11,363
  • రాహుల్ ద్రవిడ్ - 10,889
  • ఎంఎస్ ధోనీ - 10,773

అక్షర్​ను అందుకే తీసుకోలేదు.. అయితే మ్యాచ్​కు ముందుకు వరుసగా మూడో రోజు టెస్టు ఆడుతున్న ఫీలింగ్ ఉందని, ఇలాంటి సవాల్​ను స్వీకరించి ముందుకెళ్లడం ఎంతో కీలకమని రోహిత్ పేర్కొన్నాడు. అలానే తుది జట్టులో శార్దూల్‌ ఠాకూర్‌ను పక్కన పెట్టి, అక్షర్ పటేల్‌ను ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు.

"గత మ్యాచ్‌లోనూ మేం మొదట బ్యాటింగ్ చేశాం. ఇప్పుడు టాస్‌ నెగ్గగానే బ్యాటింగ్‌ ఎంచుకున్నాం. క్రికెటర్‌గా ఎన్నో ఛాలెంజెస్​ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది వ్యక్తిగతంగానైనా.. జట్టుపరంగానైనా పోరాడుతూ ముందుకు సాగుతాం. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు ఐదు రోజుల విరామం వచ్చింది. ఇప్పుడు వరుసగా మూడు రోజు ఆడటం భిన్నంగా ఉంది. అయితే, ఉత్సాహంతోనే బరిలోకి దిగాము. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకోవడానికి కారణం అదనంగా స్పిన్నర్‌ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని రోహిత్ అన్నాడు.

Rohit Sharma Asia Cup 2023 : రోహిత్ ముందు రెండు భారీ లక్ష్యాలు.. రాబోయే 3 నెల‌లు కీల‌కం..

ODI World Cup 2023 Rohit sharma : ఇకపై అలా అడగొద్దు.. సమాధానం చెప్పను.. జర్నలిస్ట్​పై రోహిత్ శర్మ అసహనం

Last Updated : Sep 12, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.