ETV Bharat / sports

Asia cup 2023 ind vs pak venue : ఆసియా కప్​ షెడ్యూల్​ రెడీ.. భారత్​-పాక్ మ్యాచ్​ వేదిక ఇదే! - ఆసియా కప్ భారత్ పాక్ మ్యాచ్​

asia cup 2023 ind vs pak venue : ఆసియాకప్​ 2023లో భాగంగా భారత్​.. పాకిస్థాన్​కు వెళ్లే విషయమై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ క్లారిటీ ఇచ్చారు. భారక్-పాక్ మ్యాచ్ ఎక్కడ జరగనుందో తెలిపారు.

Asia cup 2023 ind vs pak venue
ఆసియా కప్​ షెడ్యూల్​ రెడీ.. భారత్​-పాక్ మ్యాచ్​ వేదిక ఇదే!
author img

By

Published : Jul 12, 2023, 9:21 AM IST

asia cup 2023 ind vs pak venue : ఆసియా కప్​ 2023 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. హైబ్రీడ్‌ మోడల్‌లో ఈ మెగాటోర్నీ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్​.. ఈ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్​లో జరగనుండగా.. తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించనున్నారు.

అయితే ఈ ఆసియాకప్​లో టీమ్​ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వేదిక గురించి ఇంకా చర్చ సాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టతనిచ్చారు. ఆసియా కప్ కోసం భారత జట్టు.. పాకిస్థాన్ వెళ్లబోతుందని పాక్​ మీడియాలో వచ్చిన కథనాల్ని కొట్టిపారేశారు. అలాగే చర్చల కోసం జైషా కూడా పాకిస్థాన్​కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. పాక్​కు భారత్​ వెళ్లట్లేదని.. ఇద్దరి మధ్య జరగాల్సిన మ్యాచ్​ను శ్రీలంకలో నిర్వహించబోతున్నారని ఆయన తెలిపారు. దీంతో 2010 తరహాలోనే.. టీమ్​ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్​ డంబుల్లా మైదానం వేదికగా జరిగే అవకాశం ఉంది.

asia cup 2023 schedule : "మా కార్యదర్శి జైషా పీసీబీ హెడ్ జాకా అష్రఫ్​ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ కూడా ఖరారైంది. పాకిస్థాన్​ వేదికగా నాలుగు లీగ్ మ్యాచ్​లు జరగనున్నాయి. ఆ తర్వాత శ్రీలంక వేదికగా 9 మ్యాచులు జరగనున్నాయి. ఒకవేళ ఈ రెండు జట్లు ఫైనల్​లో తలపడితే.. ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు" అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. కాగా, ఈ శుక్రవారం(జులై 14) ఆసియా కప్‌ 2023 పూర్తి షెడ్యూల్​ను విడుదల చేసే అవకాశముంది.

జైషాతో సమావేశంపై పీసీబీ చీఫ్‌ మాట్లాడుతూ.. ''జై షాతో సమావేశం మంచి ఆరంభం అని ఆశిస్తున్నాను. ఆసియా కప్‌ హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడం మాకు సమ్మతమే. భవిష్యత్​లోనూ భారత్‌-పాకిస్థాన్​ క్రికెట్‌ మైత్రి బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. బంధాన్ని మరింత బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతాం'' అని అన్నారు. కాగా, 2016 తర్వాత భారత ఉపఖండంలో జరగనున్న మొదటి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. అనంతరం 2018, 2022 యూఏఈ వేదికగా జరిగింది.

ODI worldcup 2023 ind vs pak : ఇకపోతే ఈ ఆసియా కప్ 2023 ముగిసిన తర్వాత జరగబోయే వన్డే ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియా-పాకిస్థాన్.. అక్టోబర్ 15న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.

ఇదీ చూడండి :

IND vs WI team squad 2023 : ఓపెనర్​గా యశస్వి జైశ్వాల్​.. మూడో స్థానంలో గిల్​

రూ.1.27 లక్షల కోట్లకు ఐపీఎల్ విలువ.. నెంబర్ 1 టీమ్ ఏదో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.