ETV Bharat / sports

Asia Cup 2023 IND VS PAK : కుల్దీప్​ పాంచ్ పటాకా.. సూపర్-4 మ్యాచ్​లో పాక్​పై భారత్​ సూపర్ విక్టరీ - భారత్ పాక్ మ్యాచ్ కుల్దీప్ వికెట్లు

Asia Cup 2023 IND VS PAK : ఆసియా కప్​లో భాగంలో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధించింది.

KohliAsia Cup 2023 IND VS PAK : సూపర్-4 మ్యాచ్​.. పాకిస్థాన్​పై టీమ్​ఇండియా సూపర్ విక్టరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 11:00 PM IST

Updated : Sep 12, 2023, 12:10 AM IST

Asia Cup 2023 IND VS PAK : హమ్మయ్యా.. ఎట్టకేలకు వరుణ దేవుడు అడ్డుపడకుండా భారత్​-పాక్ మ్యాచ్​ పూర్తయ్యేలా సహకరించాడు. ఆసియాకప్​ సూపర్ ఫోర్​లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​పై టీమ్​ఇండియా అద్భుత విజయం సాధించింది. సమష్టి కృష్టితో ఫామ్​లో ఉన్న పాక్​ జట్టును తక్కువ స్కోరుకే మట్టికరిపించింది. భారత్ జట్టు నిర్దేశించిన 357 పరుగుల లక్ష్యాన్ని దాయాది జట్టు ఛేదించలేకపోయింది. 32 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. పాకిస్థాన్​ బ్యాటర్లలో ఇద్దరు గాయపడడంతో వాళ్లు బ్యాటింగ్​కు రాలేదు. దీంతో పాకిస్థాన్ ను ఆలౌట్ గా పరిగణించి టీమ్​ఇండియాను విజేతగా ప్రకటించారు. కుల్దీప్ యాదవ్(5/25)​, శార్దూల్, హార్దిక్​, బుమ్రా తలో వికెట్​ తీశారు. సూపర్‌ ఇన్నింగ్‌తో విజృంభించిన కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఈ విజయంతో సూపర్ -4 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇక మంగళవారమే(సెప్టెంబర్ 12) శ్రీలంకతో ఇదే స్టేడియంలో మరో పోరు టీమ్ఇండియా ఆడనుంది.

IND VS PAK kuldeep wickets : కుల్దీప్ పాంచ్ పటాకా... భారత్ నిర్దేశించిన 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ కు మంచి శుభారంభం దక్కలేదు. భారత పేసర్ బుమ్రా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇమామ్‌ (9*) వికెట్‌ తీసి బోణీ కొట్టాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు ఎవరినీ భారత బౌలర్లు కుదురుకోనీయలేదు. ఫఖర్ జమాన్ (27), అఘా సల్మా్‌న్ (23), ఇఫ్తికార్‌ అహ్మద్ (23) మాత్రం కాస్త పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. వీరు కూడా ఈ మాత్రం చేయకపోతే పాక్ పరిస్థితి మరింత దారుణంగా మారేది. పాక్ బ్యాటర్లందరూ చేతులేత్తేయడానికి కారణం కుల్‌దీప్‌ యాదవే (5/25). పాండ్య, బుమ్రా, ఠాకూర్‌తో కలిసి పాక్‌ టాప్ ఆర్డర్ ను కూల్చేశాడు. కుల్‌దీప్‌ దెబ్బకు పాక్ బ్యాటర్లెవ్వరూ క్రీజ్‌లో ఉండలేకపోయారు.

అంతకుముందు టీమ్​ఇండియాలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. తొలి రోజు మ్యాచ్​లో రోహిత్(56), గిల్​(58) హాఫ్​ సెంచరీలు చేయగా.. రిజర్వ్​ డేలో కోహ్లీ-కేఎల్ రాహుల్ కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు చేరో సెంచరీ బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ 94 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సల సాయంతో 122 అజేయ పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్​ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో 111 అజేయ పరుగులు చేశాడు.

Kohli Centuries : మోస్ట్ డేంజరెస్​గా కోహ్లీ 2.0.. ఈ ఏడాది ఏకంగా ఎన్ని సెంచరీలు, పరుగులు చేశాడంటే?

Kohli Centuries : కింగ్ కోహ్లీ ఎప్పుడూ నెం.1.. ఏడాది కాలంలో 7 రికార్డ్ సెంచరీలు

Last Updated : Sep 12, 2023, 12:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.