ETV Bharat / sports

డ్రెస్సింగ్ రూమ్​లో ఎమోషన్స్​ - ఆ రోజు కోహ్లి, రోహిత్‌ ఏడ్చారు - రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్​

Ashwin World Cup 2023 : వరల్డ్ కప్ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయంపై టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ మాట్లాడాడు. ఆ విశేషాలు మీ కోసం..

Ashwin World Cup 2023
Ashwin World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 10:09 AM IST

Ashwin World Cup 2023 : వ‌న్డే ప్రపంచ‌క‌ప్​లో ఓటమిని ఎవరూ మర్చిపోలేరు. వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమ్ఇండియా ఒక్క సారిగా ఓటమి పాలవ్వడాని క్రికెట్ ఫ్యాన్స్​ జీర్ణించుకోలేకపోయారు. గెలుపు మనదే అనుకున్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడి మన ప్లేయర్లక షాకిచ్చింది. దీంతో రోహిత్​ సేనకు పరాభవం తప్పలేదు. ఆ సమయంలో ఎంతో మంది ఏడ్చారు. ఇక టీమ్ఇండియా ప్లేయర్లు కూడా నిరాశతో వెనుతిరిగారు. తాజాగా ఈ విషయంపై టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ మాట్లాడాడు. మ్యాచ్​ తర్వాత.. డ్రెస్సింగ్​ రూమ్​కు వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు ఘోరంగా ఏడ్చారని.. వారి ప‌రిస్థితిని చూడ‌లేక‌పోయామ‌ంటూ అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన తోటి ప్లేయర్ల కూడా భావోద్వేగానికి లోనయ్యారని తెలిపాడు.

"ఆరోజు మేమందరం చాలా బాధ‌ప‌డ్డాం. ఇక రోహిత్‌, కోహ్లి అయితే ఏడుస్తూనే ఉన్నారు. వాళ్లిద్ద‌రిని అలా చూసి మాకు మ‌రింత బాధగా అనిపించింది. అస‌లు అలా జ‌ర‌గ‌కుండా ఉండాల్సింది. ఎంతో అనుభ‌వం, నైపుణ్యం ఉన్న జ‌ట్టు మన టీమ్ఇండియా. క‌చ్చితంగా గెలుస్తుంద‌నే అందరం అనుకున్నాం. టీమ్​లోని ప్లేయర్లందరూ త‌మ రోల్​ను చ‌క్క‌గా పోషించారు. కానీ ఆఖరికి చేదు అనుభ‌వమే ఎదురైంది. స‌హ‌జంగానే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పుణికిపుచ్చుకున్న ఆ ఇద్ద‌రు లీడ‌ర్లు ఆట‌గాళ్ల‌కు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి వాళ్లను మ‌రింత మెరుగుప‌డేలా చేశారు" అని రోహిత్‌, కోహ్లిని అశ్విన్​ ప్రశంసించాడు.

Rohit Sharma World Cup 2023 : ఇక రోహిత్ శ‌ర్మ గొప్ప కెప్టెన్ అని.. టీమ్​లోని ప్ర‌తి ప్లేయర్​ అభిరుచులు రోహిత్​కు తెలుస‌ని అశ్విన్​ పేర్కొన్నాడు. అంతే కాకుండా వారి నైపుణ్యాల గురించి రోహిత్​కు అవ‌గాహ‌న ఉంద‌ని అన్నాడు. అయితే, కొన్నిసార్లు ఇలాంటి చేదు అనుభ‌వాలను ఎదుర్కోక త‌ప్ప‌దంటూ తెలిపాడు. గాయం కార‌ణంగా అక్ష‌ర్ ప‌టేల్ టోర్నీకి దూరం కావ‌డం వల్ల ఆఖ‌రి నిమిషంలో అశ్విన్ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో చోటు సంపాదించాడు. అయితే ఆస్ట్రేలియాతో అక్టోబ‌రు 8 న జరిగిన మ్యాచ్‌లో మాత్ర‌మే అశ్విన్​కు ఆడే అవ‌కాశం ద‌క్కింది.

అలా జరిగితే ముంబయికి గోల్డెన్ ఛాన్స్​- అంతా హార్దిక్ నిర్ణయంపైనే! : అశ్విన్

చెన్నై కెప్టెన్సీని రిజెక్ట్​ చేసిన సంజూ ? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.