ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆ జట్టుకు టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) హెచ్చరికలు జారీచేశాడు! కౌంటీ క్రికెట్లో సర్రె జట్టుకు అశ్విన్.. ఒక్క ఇన్నింగ్స్‌లో 29 పరుగులిచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సోమర్సెట్ 429 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. సర్రే 240 పరుగులకు ఆల్ఔటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన అశ్విన్.. ఆరు వికెట్లు తీశాడు. ఇతడితో పాటు మరో క్రికెటర్ డేనియల్ మోరిఆర్టీ 4 వికెట్లు పడగొట్టడం వల్ల సోమర్సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సర్రే నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగిశాక భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం ఇచ్చింది బీసీసీఐ. దీంతో కొన్నిరోజులు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్‌కు అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతున్న నేపథ్యంలో అతడు ఈ మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించాడు. ఆగస్టు 4 నుంచి ఐదు మ్యాచ్‌లు టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్-టీమ్ఇండియా తలపడనున్నాయి.
ఇదీ చూడండి: ఆసీస్ క్రికెటర్‌కు కొవిడ్.. అశ్విన్ రికార్డు