Ashes 2nd Test 2021: యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓటమిపాలైన ఇంగ్లాండ్.. రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై ఎలాగైనా పైచేయి సాధించాలని చూస్తోంది. అడిలైడ్‌లో గురువారం ఈ డే అండ్ నైట్ టెస్టు ప్రారంభమైంది. తొలి టెస్టుకు దూరమైన జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లకు రెండో టెస్టులో చోటు కల్పించింది ఇంగ్లాండ్. ఈ టెస్టుతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులాడిన ప్లేయర్ల జాబితాలో అండర్సన్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. 150 టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ అడుగుపెట్టాడు.
James Anderson Test Matches: ఇప్పటివరకు ప్రపంచ టెస్టు చరిత్రలో అత్యధికంగా 200 మ్యాచ్‌లు ఆడిన సచిన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, స్టీవ్ వా 168 టెస్టులతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అయితే.. ఈ టెస్టుతో ఇప్పటివరకు 150 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ క్లబ్లో పదో ఆడిగాడిగా స్టువర్ట్ బ్రాడ్ చేరిపోయాడు.
Cricketer Played Most Test Matches:
- అత్యధిక టెస్టులాడిన జాబితాల్లో 166 టెస్టు మ్యాచ్‌లతో జాక్వెస్ కలిస్ ఐదో స్థానంలో ఉన్నాడు.
- 164 టెస్టులతో విండీస్ మాజీ క్రికెటర్ చంద్రపాల్, టీమ్ఇండియా కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
- 161 మ్యాచ్‌లతో అలిస్టర్ కుక్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
- ఆసీస్ మాజీ క్రీడాకారుడు అలెన్ బోర్డర్ 156 టెస్టులతో 9వ స్థానంలో ఉన్నాడు.
- యాషెస్ సిరీస్‌తో స్టువర్డ్ బ్రాడ్ 150 టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో చేరిపోయాడు.
ఇదీ చదవండి: Pat Cummins Covid: యాషెస్ రెండో టెస్టుకు కమిన్స్ దూరం.. కెప్టెన్‌గా స్మిత్