Eng Vs Aus Ashes : యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తే.. ఆస్ట్రేలియా మాత్రం సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఆరంభంలో వికెట్లు పడిపోయినా.. ఉస్మాన్ ఖవాజా సెంచరీతో ఆదుకోవడం వల్ల ఆ జట్టు రెండో రోజు ఆట చివరికి 311/5తో కాస్త జోరందుకుని మెరుగైన స్థితికి చేరుకుంది. ఖవాజాకు తోడుగా అలెక్స్ కేరీ క్రీజులో ఉన్నాడు. హెడ్ కూడా రాణించాడు.
ఓవర్‌నైట్ స్కోరు 14/0తో రెండో రోజు, తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ టీమ్‌ను ఇంగ్లాండ్ పేసర్లు పరీక్షించారు. వర్షం కురిసి ఆరిన పిచ్‌పై బౌన్స్, స్వింగ్‌లను రాబట్టి ప్రత్యర్థులకు చెమటలు పట్టించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా బ్రాడ్ ప్రభావవంతంగా బంతులేశాడు. ఎక్కువ ఆఫ్‌స్టంప్ లోగిలిలో బౌల్ చేసిన అతడు.. వార్నర్, ఖవాజాలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు భిన్నంగా ఆసీస్ ఇన్నింగ్స్ మొదట్లో చాలా నెమ్మదిగా సాగింది. ఇక విసిగిపోయిన వార్నర్.. బ్రాడ్ ఓవర్లో ఓ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. తర్వాతి బంతికే లబుషేన్‌ను ఔట్ చేసిన ఈ పేసర్.. ఆసీస్‌ను దెబ్బతీశాడు.
Ashes 2023 : భారత్‌తో ఆడిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీతో అదరగొట్టిన స్టీవ్ స్మిత్ ఎక్కువసేపే క్రీజులో ఉన్నప్పటికీ అంత సౌకర్యంగా ఆడలేకపోయాడు. మూడు స్లిప్స్‌తో పాటు లెగ్ గల్లీలో ఇద్దరు ఫీల్డర్లను పెట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్.. స్మిత్‌పై ఒత్తిడి పెంచాడు. దీంతో బౌండరీలు రాబట్టలేకపోయిన అతడు.. చివరికి స్టోక్స్ బౌలింగ్‌లో ఔటై పెవిలియన్ బాట పట్టాడు. 67/3తో కంగారూ జట్టు కష్టాల్లో పడిన సమయమది. కానీ ఈ స్థితిలో ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్.. ఖవాజాకు జత కలవడం వల్ల పరిస్థితి క్షణాల్లో మారిపోయింది. ఆసీస్ నెమ్మదిగా గేర్లు మార్చి పరుగుల బాట పట్టింది.
అయితే మొదట హెడ్.. ఆ తర్వాత గ్రీన్‌లను స్పిన్నర్ మొయిన్ అలీ ఔట్ చేసి ఆసీస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీంతో ఆ జట్టు స్కోర్ 220/5తో నిలిచింది. కానీ ఖవాజా తన జోరు తగ్గించలేదు. కేరీ సాయంతో జట్టు స్కోరు 300 దాటించిన అతడు.. ఈ క్రమంలో టెస్ట్‌లో తన సెంచరీని అందుకున్నాడు. ఈ మైలురాయి దాటిన కొద్దిసేపటికే బ్రాడ్ బౌలింగ్‌లో ఖవాజా బౌల్డ్ అయినా.. అది నోబాల్ కావడం వల్ల ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు స్థిరంగా బ్యాటింగ్ చేసి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కేరీతో పాటు ఖవాజా ఆట చివరి వరకు అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం చేతిలో 5 వికెట్లు ఉన్న ఆ జట్టు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 393/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
-
What a contest!
— Cricket Australia (@CricketAus) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A brilliant century by Usman Khawaja, supported by 50s from Alex Carey and Travis Head has our Aussie men right in this at the end of the second day of play. #Ashes pic.twitter.com/ZOYEvYl7zO
">What a contest!
— Cricket Australia (@CricketAus) June 17, 2023
A brilliant century by Usman Khawaja, supported by 50s from Alex Carey and Travis Head has our Aussie men right in this at the end of the second day of play. #Ashes pic.twitter.com/ZOYEvYl7zOWhat a contest!
— Cricket Australia (@CricketAus) June 17, 2023
A brilliant century by Usman Khawaja, supported by 50s from Alex Carey and Travis Head has our Aussie men right in this at the end of the second day of play. #Ashes pic.twitter.com/ZOYEvYl7zO