ETV Bharat / sports

ట్రోలింగ్‌పై అర్ష్‌దీప్‌ రియాక్షన్​.. ఏమన్నాడంటే

Arshdeep Singh Catch : ఆసియా కప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కీలక క్యాచ్​ జారవిడిచాడు బౌరల్​ అర్ష్​దీప్​. దీంతో తీవ్రమైన ట్రోలింగ్​కు గురవుతున్నాడు. ఈ క్రమంలో తనపై వస్తోన్న కామెంట్లకు అర్ష్‌దీప్‌ ఎలా స్పందించాడో అతడి తల్లిదండ్రులు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.

Arshdeep Singh Catch
Arshdeep Singh Catch
author img

By

Published : Sep 6, 2022, 3:12 PM IST

Arshdeep Singh Catch : ఆసియాకప్‌ సూపర్‌ 4 దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్‌ వదిలేసిన భారత్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఈ క్రమంలో వస్తోన్న కామెంట్లపై అర్ష్‌దీప్‌ ఎలా స్పందించాడో అతడి తల్లిదండ్రులు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ట్రోలింగ్‌ను అతడు చాలా తేలిగ్గా తీసుకొన్నట్లు పేర్కొన్నారు.

అర్ష్‌దీప్‌ సద్విమర్శలను స్వీకరించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడని అతడి తండ్రి తెలిపారు. "ఈ ట్వీట్లు, మెసేజ్‌లను చూసి నవ్వుకున్నాను. వాటిల్లో సానుకూలమైనవాటినే స్వీకరించాను. ఈ ఘటన నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది' అని అర్ష్‌దీప్‌ నాతో అన్నాడు. అయితే.. ఒక తండ్రిగా నేను బాధపడ్డాను. అతడి వయసు 23 ఏళ్లే. నేను ట్రోల్స్‌ గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రతి ఒక్కరి నోరు మూయించలేం. ఫ్యాన్స్‌ లేకుండా గేమ్‌ లేదు. ఒక్క నష్టంతో ఇతరులు జీర్ణించుకోలేకపోయినా.. నీ పక్షాన కొందరు ఉంటారు. ఆటలో చివరికి ఒక జట్టే విజేతగా నిలవగలదు" అని అర్ష్‌దీప్‌ తండ్రి దర్శన్‌ వివరించారు. తల్లి బల్జీత్‌ మాట్లాడుతూ "భారత జట్టు మొత్తం తనకు మద్దతుగా నిలిచిందని అర్ష్‌ నాతో చెప్పాడు" అని పేర్కొన్నారు.

అర్ష్‌దీప్‌ క్యాచ్‌ను వదిలేయడంపై మ్యాచ్‌ అనంతరం కింగ్‌ కోహ్లీ కూడా స్పందించాడు. ఈ విషయంలో అర్ష్‌దీప్‌కు పూర్తి మద్దతు ప్రకటించాడు. "తప్పులు ఎవరైనా చేస్తారు. మ్యాచ్‌ చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్పులు జరగొచ్చు. నేను తొలిసారి ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు షాహిద్‌ అఫ్రిదీ బౌలింగ్‌లో చెత్తషాట్‌ ఆడాను. ఆ రోజు నిద్రపట్టలేదు. నా కెరీర్‌ ముగిసిపోయిందనుకొన్నాను" అని విరాట్‌ వివరించాడు.

ఇవీ చదవండి: క్రికెటర్ సురేశ్​ రైనా సంచలన నిర్ణయం

విజయ్​ దళపతి వర్సెస్​ ఇండియా పాక్​ మ్యాచ్‌.. ఈ రెండింటికి లింక్​ ఏంటబ్బా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.