ICC Rankings India: 2021-22 క్రికెట్ సీజన్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీ20లో ఇటీవల వరుస విజయాలు నమోదు చేసిన టీమ్ఇండియా.. ర్యాంకింగ్‌లో తొలి స్థానాన్ని పదిలం చేసుకుంది. టెస్టు ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉంది. టెస్టుల్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇండియా తొమ్మిది పాయింట్లు తేడాతో రెండో ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ తొలిస్థానం దక్కించుకుంది. భారత్ నాలుగో స్థానంలో ఉంది.
ICC Rankings 2022: టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య వ్యత్యాసం రెండు పాయింట్లే ఉండేది. అయితే, జనవరిలో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై 4-0తో గెలవడం వల్ల.. ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. పాకిస్థాన్... ఇంగ్లాండ్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరింది. మే 4 వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లను ర్యాంకింగ్స్ కోసం పరిగణలోకి తీసుకుంది ఐసీసీ. 2021లో ఇంగ్లాండ్- ఇండియా సిరీస్‌లో భాగంగా వాయిదా పడిన చివరి టెస్టు ఫలితాన్ని సైతం ర్యాంకింగ్స్ కోసం పరిగణలోకి తీసుకోనున్నారు.
మూడు ఫార్మాట్లలో టాప్ 10లో ఉన్న జట్లు ఇవే...
ఇదీ చదవండి: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఈ సీజన్లోనే భారీ సిక్సర్