Duvvarapu Sivakumar USA Squad: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగాడతడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. 13 బంతుల్లో ఏడు పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందులో ఓ ఫోర్ బాదాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 11 పరుగులిచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేదు.
అతడు ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను లిస్ట్-ఏ 40 మ్యాచులు(1334 పరుగులు, 45వికెట్లు), 16 టీ20లు(342 రన్స్, 15 వికెట్లు) ఆడాడు. అతడు కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా. ఆఖరిసారిగా ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడ కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధనను పూర్తి చేసుకున్న అతడికి ఇటీవలే అక్కడి జట్టులో చోటు దక్కింది. కాగా, అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అమెరికా 19.4 ఓవర్లలో 138 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు 19 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇదీ చూడండి: కోహ్లీని తొలగించే దమ్ము ఏ సెలెక్టర్‌కు లేదు: పాక్ మాజీ కెప్టెన్