ETV Bharat / sports

మళ్లీ తెరపైకి మన్కడింగ్ వివాదం.. ​అశ్విన్​ను చూసి నేర్చుకోవాలంటూ జంపాకు అడ్వైస్​..

author img

By

Published : Jan 3, 2023, 8:20 PM IST

బిగ్​బాష్ లీగ్​లో మన్కడింగ్​ వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా ప్లేయర్​​ ఆడమ్ జంపా మన్కడింగ్​కు పాల్పడ్డాడు. ఆ వివరాలు..

adam zampa mankading
మళ్లీ తెరపైకి మన్కడింగ్ వివాదం.. ​అశ్విన్​ను చూసి నేర్చుకోవాలంటూ జంపాకు అడ్వైస్​..

బిగ్ బాష్ లీగ్​లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ క్యాచ్‌తో వివాదాల్లో నిలిచిన ఈ లీగ్​.. ఇప్పుడు ఆడమ్ జంపా మన్కడింగ్​తో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్​ ట్రెండ్ అవుతోంది. మంగళవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్టార్స్ జట్టు తమ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను ఆడుతుండగా.. ఆడమ్ జంపా బౌలింగ్ చేశాడు. అతడు ఐదో బంతిని బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్​ టామ్ రోజర్స్ .. జంపా బంతి విసరక ముందే క్రీజు దాటేశాడు. దాంతో వెంటనే వెనక్కి తిరిగిన జంపా.. వికెట్లను కూల్చి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ఔట్​ ప్రకటించలేదు.

టెక్నికల్‌గా నాటౌట్​.. అయితే అంపైర్​ నిర్ణయం తీసుకోవడం కోసం టీవీ అంపైర్‌ సాయం కోరాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించడంతో.. జంపాతో సహా అంతా ఆశ్చర్యపోయారు. దీంతో రోజర్స్​ ఊపిరి పీల్చుకున్నాడు.

అశ్విన్ దగ్గర నేర్చుకో.. ఇది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? అసలే మన్కడింగ్​ అనగానే క్రికెట్​ ప్రియులకు ముందుగా టక్కున గుర్తొచ్చే పేరు అశ్విన్. ఎందుకంటే అతడితోనే ఈ మన్కడింగ్ వివాదం మొదలైంది. దీంతో అశ్విన్​- జంపా పేర్లతో నెటిజన్లు ట్విట్టర్‌లో ఫుల్​ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో అశ్విన్ ఉన్నాడు. అతని చేతిలో ఇలా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఔటైన్​ జాస్ బట్లర్ కూడా అదే జట్టులో ఉన్నాడు. తాజాగా మినీ వేలంలో ఆడమ్ జంపాను కూడా రాజస్థాన్ జట్టే కొనుగోలు చేసింది. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ.. వచ్చే ఐపీఎల్‌లో అశ్విన్ దగ్గరుండి మరీ జంపాకు మన్కడింగ్ చేయడం నేర్పిస్తాడని కొందరు.. అశ్విన్​ దగ్గర మన్కడింగ్​ నేర్చుకోవాలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Adam Zampa's attempt at a run out was deemed by the Third Umpire as not out 👀#BBL12 pic.twitter.com/cvhlLBwig5

— 7Cricket (@7Cricket) January 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: IND VS SL: జట్టులోకి బుమ్రా.. రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్​ కాదంటున్న హార్దిక్​!

బిగ్ బాష్ లీగ్​లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ క్యాచ్‌తో వివాదాల్లో నిలిచిన ఈ లీగ్​.. ఇప్పుడు ఆడమ్ జంపా మన్కడింగ్​తో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్​ ట్రెండ్ అవుతోంది. మంగళవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్టార్స్ జట్టు తమ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను ఆడుతుండగా.. ఆడమ్ జంపా బౌలింగ్ చేశాడు. అతడు ఐదో బంతిని బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్​ టామ్ రోజర్స్ .. జంపా బంతి విసరక ముందే క్రీజు దాటేశాడు. దాంతో వెంటనే వెనక్కి తిరిగిన జంపా.. వికెట్లను కూల్చి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ఔట్​ ప్రకటించలేదు.

టెక్నికల్‌గా నాటౌట్​.. అయితే అంపైర్​ నిర్ణయం తీసుకోవడం కోసం టీవీ అంపైర్‌ సాయం కోరాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించడంతో.. జంపాతో సహా అంతా ఆశ్చర్యపోయారు. దీంతో రోజర్స్​ ఊపిరి పీల్చుకున్నాడు.

అశ్విన్ దగ్గర నేర్చుకో.. ఇది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? అసలే మన్కడింగ్​ అనగానే క్రికెట్​ ప్రియులకు ముందుగా టక్కున గుర్తొచ్చే పేరు అశ్విన్. ఎందుకంటే అతడితోనే ఈ మన్కడింగ్ వివాదం మొదలైంది. దీంతో అశ్విన్​- జంపా పేర్లతో నెటిజన్లు ట్విట్టర్‌లో ఫుల్​ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో అశ్విన్ ఉన్నాడు. అతని చేతిలో ఇలా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఔటైన్​ జాస్ బట్లర్ కూడా అదే జట్టులో ఉన్నాడు. తాజాగా మినీ వేలంలో ఆడమ్ జంపాను కూడా రాజస్థాన్ జట్టే కొనుగోలు చేసింది. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ.. వచ్చే ఐపీఎల్‌లో అశ్విన్ దగ్గరుండి మరీ జంపాకు మన్కడింగ్ చేయడం నేర్పిస్తాడని కొందరు.. అశ్విన్​ దగ్గర మన్కడింగ్​ నేర్చుకోవాలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి: IND VS SL: జట్టులోకి బుమ్రా.. రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్​ కాదంటున్న హార్దిక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.