Abid Ali heart Attack: పాకిస్థాన్ టెస్టు క్రికెటర్ అబిద్ అలీకి మైదానంలో బ్యాటింగ్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతుండగా.. వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.
క్వైద్-ఎ-అజాం ట్రోఫీలో భాగంగా మంగళవారం సెంట్రల్ పంజాబ్- ఖైబర్ (Khyber Pakhtunkhwa) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే పంజాబ్ తరపున బ్యాటింగ్కు దిగిన అబిద్ అలీకి మ్యాచ్ మధ్యలోనే ఛాతి నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని టీమ్ యాజమాన్యానికి చెప్పగా.. వెంటనే స్పందించిన టీమ్ అతన్ని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు అలీ. అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 9000 రన్స్ సాధించాడు అలీ. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు క్రికెట్ తర్వాత సెంట్రల్ పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ టోర్నీలో ఆడుతున్నాడు.
ఇదీ చదవండి: Kohli Dravid Record: ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన విరాట్