టీ20ల్లో టీమ్ఇండియా.. పూర్తిస్థాయిలో టాపార్డర్ బ్యాటర్లపైనే ఆధారపడుతోందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra Latest) అన్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లపై భారం వేస్తోందని తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు.
"పరిమిత ఓవర్లలో ఆటగాడు వ్యక్తిగతంగా చేసే స్కోరే చాలా కీలకం. కానీ, టీమ్ఇండియా టాపార్డర్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. రోహిత్, రాహుల్ బాగా ఆడితే భారీ లక్ష్యం నమోదు చేసి టీమ్ గెలుస్తోంది. కోహ్లీ విషయంలోను ఇదే వర్తిస్తుంది."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో(T20 World Cup 2021) తొలి రెండు మ్యాచ్‌ల్లో టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ ఓటమి పాలైందని ఆకాశ్ తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో(IND vs AFG T20) టాపార్డర్ బ్యాటర్లు కళ్లుచెదిరే బ్యాటింగ్ చేశారు కాబట్టి టీమ్ఇండియా విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఇలా టాప్ ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లే రాణించాలనే ధోరణి మారాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టీ20ల్లో ప్రతిసారి దాదాపు 200 పరుగుల లక్ష్యం పెట్టే సత్తా టీమ్ఇండియాకు ఉందని అకాశ్ అన్నాడు. కానీ, ఆ స్థాయిలో టీమ్ఇండియా ప్రతిభ కనబరచడం లేదని తెలిపాడు. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు వ్యక్తిగతంగా ఎక్కువ స్కోరు నమోదు చేసే అలవాటు చేసుకోవాలని సూచించాడు.
ఇదీ చదవండి: