హరారే వేదికగా జరిగిన పాకిస్థాన్-జింబాబ్వే రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే 19 పరుగుల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో నిర్ణయాత్మక చివరి టీ20 ఆదివారం జరగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. 34 పరుగులు చేసిన ఓపెనర్ టినాషే కమున్కమ్వే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో మహమ్మద్ హస్నేన్, డానిష్ అజీజ్ చెరో రెండు వికెట్లతో రాణించారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టాలో సంజనకు బుమ్రా ప్రేమ బాణాలు
అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఘోరంగా తడబాటుకు గురైంది. 19.5 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ అజామ్ 42 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో లుకే జోంగ్వే 4, ర్యాన్ బర్ల్ 2 వికెట్లు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఫుట్‌బాల్ కోచ్‌కు ఆర్సీబీ జెర్సీ పంపిన కోహ్లీ