2024 IPL Auction : కొత్తగా ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్య స్థానాన్ని గుజరాత్ ఏ ఆటగాడితో భర్తీ చేస్తుంది? శార్దూల్ ఠాకూర్‌ను ఏ టీమ్ దక్కించుకుంటుంది? హర్షల్ పటేల్‌కు ఎంత ధరకు కొనుగోలు చేస్తారు? మనీశ్ ఏ టీమ్‌లో చేరతాడు? ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, స్టార్క్, రచిన్ రవీంద్ర వంటి విదేశీ ప్లేయర్లలో జాక్‌పాట్ ఎవరికి తగులుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నేడు (మంగళవారం) జరగనున్న మినీ వేలంలో సమాధానాలు దొరకనున్నాయి. మరి ఈ వేలంలో రూ.కోట్లు కొల్లగొట్టేదెవరోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2024 ఐపీఎల్ కోసం దుబాయ్ వేదికగా నేడు (మంగళవారం) జరగనుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అందుబాటులో ఉన్నారు. వారిలో 214 మంది భారత క్రికెటర్లు కాగా, 119 మంది ఫారిన్ ప్లేయర్లు. ఇక ప్రస్తుతం 77 స్లాట్లు ఖాళీగా ఉండగా, అందులో 30 ఫారిన్ ప్లేయర్ల కోటా.
ఈ వేలంలో అత్యధిక ధర ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఆస్ట్రేలియా స్టార్ పేస్‌గన్ మిచెల్ స్టార్క్ (బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు) దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వేలంలోకి వచ్చాడు. ఈ పేసర్ కోసం పలు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీఉండే ఛాన్స్ ఉంది. అతడి తర్వాత న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్రపైనే అందరి కళ్లున్నాయి. రీసెంట్గా ముగిసిన వరల్డ్‌కప్‌లో అతడి ప్రదర్శనే ఇందుకు కారణం. రచిన్ (బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలు) ఈ వేలంలో భారీ ధర దక్కింకోవడం ఖాయం!
ఫారిన్ ప్లేయర్లలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు), సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ గెరాల్డ్ కొట్జీ (రూ.2 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.2 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (రూ.2 కోట్లు), క్రిస్ వోక్స్ (రూ.2 కోట్లు), ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ హసరంగ (రూ.1.50 కోట్లు), డారిల్ మిచెల్ (రూ.1.50 కోట్లు), జెమ్మి నీషమ్ (రూ.1.50 కోట్లు)కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
భారత ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్ (రూ.2 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.2 కోట్లు), ఉమేశ్ యాదవ్ (రూ.2 కోట్లు) కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరుస్తుందోనని ఆసక్తిగా ఉంది. ఇక యంగ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్, కేఎస్ భరత్, అర్షిన్ కులకర్, ముషీర్ ఖాన్, కుమార్ కుశాగ్ర, సమీర్ రిజ్వీపై ఫోసక్ ఉండనుంది.
-
Auction Briefing ✅
— IndianPremierLeague (@IPL) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The 🔟 teams are set for tomorrow!
Are YOU ready for #IPLAuction ❓ pic.twitter.com/uCDuC30Kzn
">Auction Briefing ✅
— IndianPremierLeague (@IPL) December 18, 2023
The 🔟 teams are set for tomorrow!
Are YOU ready for #IPLAuction ❓ pic.twitter.com/uCDuC30KznAuction Briefing ✅
— IndianPremierLeague (@IPL) December 18, 2023
The 🔟 teams are set for tomorrow!
Are YOU ready for #IPLAuction ❓ pic.twitter.com/uCDuC30Kzn
IPL హిస్టరీలో హయ్యెస్ట్ బిడ్డింగ్స్- టాప్‌లో కరన్, గ్రీన్- ఈసారి ఆ మార్క్ దాటేదెవరో?
IPL వేలానికి అంతా సెట్- 333 మంది ప్లేయర్లు- రూ. 262.95 కోట్లు- లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?