ETV Bharat / sports

ప్రపంచ కప్ గెలిచిన క్రికెటర్... ఇప్పుడు కార్పెంటర్! - ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్

ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్​ పని చేస్తున్నాడో మాజీ క్రికెటర్​. ఆస్ట్రేలియాకు చెందిన జేవియర్​ డోహెర్టీ.. 2015 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్​ అసోసియేషన్​ సాయాన్ని సున్నితంగా నిరాకరించాడు.

Xavier Doherty, former australia cricketer
జేవియర్ డోహెర్టీ, ఆసీస్ మాజీ క్రికెటర్
author img

By

Published : Jun 1, 2021, 4:43 PM IST

రిటైర్మెంట్ అనంతరం ఏ క్రికెటరైనా ఏం చేస్తాడు? కోచ్​గానో, వ్యాఖ్యాతగానో మారతాడు. కానీ, ఆసీస్ మాజీ ఆటగాడు జేవియర్ డోహెర్టీ ఇందుకు భిన్నం. క్రికెట్ తర్వాత కార్పెంటర్​గా మారాడు. 2015 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడైనా జేవియర్.. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికి నాలుగేళ్లు దాటింది. పొట్టకూటి కోసం ప్రస్తుతం కార్పెంటర్​ పని చేస్తున్నాడు.

జేవియర్​ పరిస్థితిని తెలుసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్​ అసోసియేషన్.. సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కానీ, అందుకు డోహెర్టీ ఒప్పుకోలేదు. వారి సాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తాను చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ​

  • Test bowler turned carpenter 👷🔨

    Xavier Doherty took some time to find what was right for him following his retirement from cricket, but he's now building his future with an apprenticeship in carpentry.#NationalCareersWeek pic.twitter.com/iYRq2m39jt

    — Australian Cricketers' Association (@ACA_Players) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2010-15 వరకు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు డోహెర్టీ. కెరీర్​లో తొలి మ్యాచ్​ శ్రీలంకపై ఆడి 4 వికెట్లతో రాణించాడు. మొత్తంగా 60 వన్డేల్లో 55 వికెట్లు తీశాడు. నాలుగు టెస్టుల్లో 7 వికెట్లు దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి: కరోనా బారిన భువీ కుటుంబం- తల్లి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.