భారత షట్లర్ సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. కరోనా నేపథ్యంలో పెట్టిన క్వారంటైన్ నిబంధనలే అందుకు కారణం. సింగపూర్ ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం భారతీయులు 21 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. భారత్ నుంచి విమానాల రాకను ఆ దేశం ఇప్పటికే నిషేధించింది.
"21 రోజుల క్వారంటైన్ నిబంధనే టోర్నీ నుంచి ఉపసంహరించుకోవడానికి కారణం. క్వారంటైన్ 14 రోజులే అయినా నేను టోర్నీకి వెళ్లేవాడిని కాదు. ప్రాక్టీస్ లేకుండా అన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండి టోర్నీలో ఆడడం చాలా కష్టం" అని ప్రణీత్ చెప్పాడు. సాయి ప్రణీత్ ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట కూడా సింగపూర్ ఓపెన్ నుంచి వైదొలగింది. దీంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ఈ జోడీకి ఉన్న చివరి అవకాశం కూడా పోయింది.
ఇదీ చదవండి: 'ఆ ఐదు రోజులు గదిలోనే ఉండిపోయాం'