ETV Bharat / sports

అలా చేస్తే టోక్యో ఒలింపిక్స్​కు​ అర్హత సాధించలేం! - కరోనా ఎఫెక్ట్​

టోక్యో ఒలింపిక్స్​కు ఇంకెంతో సమయం లేదు. ఇప్పటికే పలు దేశాల్లోని క్రీడాకారులు సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. అయితే భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్లకు మాత్రం ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా వాటిపై మాట్లాడాడు స్టార్​ షట్లర్​ పారుపల్లి కశ్యప్​.

Tokyo Olympics qualification at risk, want clarity over home quarantine advisory
అలా చేస్తే ఒలింపిక్స్​ అర్హత కోల్పోతాం..!
author img

By

Published : Mar 12, 2020, 9:02 PM IST

విదేశాల నుంచి భారత్​కు వచ్చిన వారిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఇటీవలె ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనపై షట్లర్​ పారుపల్లి కశ్యప్​ స్పందించాడు. రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంటే పలు టోర్నీల షెడ్యూళ్లు​ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదే జరిగితే ప్లేయర్లు ఒలింపిక్స్​కు అర్హత సాధించటం కష్టమవుతుందని వెల్లడించాడు.

"మమ్మల్ని రెండు వారాలు నిర్బంధిస్తారో లేదో తెలియదు. కానీ, ఇలా చేయటం వల్ల ఒలింపిక్స్​ అర్హత పోటీలకు ఏర్పాటు చేసుకున్న మా షెడ్యూల్​ తారుమారు అవుతుంది. కొంతమంది భారత షట్లర్లు ఇప్పటికే ఒలింపిక్స్​ అర్హతకు దగ్గర్లో ఉన్నారు. తాజా నిర్ణయం వల్ల కీలక టోర్నీలకు హాజరవడానికి ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నిర్బంధం వల్ల స్విస్​ ఓపెన్​, ఇండియా ఓపెన్​లో పాల్గొనటం కష్టమవుతుంది."

- పారుపల్లి కశ్యప్​, బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు

భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్​, సైనా నెహ్వాల్​, సాయి ప్రణీత్​, కిందాబి శ్రీకాంత్​లు ప్రస్తుతం ఆల్​ ఇంగ్లాండ్​ టోర్నీలో ఆడుతున్నారు.

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా వీసాలను రద్దు చేయడమే కాకుండా విదేశాల నుంచి వచ్చే వారిని నిర్బంధ వైద్య పరీక్షలు చేస్తోంది.

ఇదీ చూడండి.. ఒలింపిక్​ 'జ్యోతి'​ వెలిగింది.. ర్యాలీపై అనుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.